కోవిడ్ హాస్పిటల్స్ హెల్ప్ డెస్క్ లు పనితీరుపై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.

 పశ్చిమగోదావరి జిల్లా... ఏలూరు (ప్రజా అమరావతి);
కోవిడ్ హాస్పిటల్స్ హెల్ప్ డెస్క్ లు పనితీరుపై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.


..


పశ్చిమగోదావరి జిల్లాలో కోవిడ్ హాస్పిటల్స్ లో హెల్ప్ డెస్క్ ల్లో సమాచారం అందడంలేదని సోషల్ మీడియాలో వస్తున్న కధనాలపై మంత్రి ఆళ్ల నాని ఆరా...


జిల్లా యంత్రాంగం, DMHO, DCHS, సూపరింటెండెంట్స్ తో

ఆదివారం ఉదయం మంత్రి ఆళ్ల నాని మొబైల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష...


జిల్లాలో అన్ని కోవిడ్ హాస్పిటల్స్ లో కోవిడ్ బాధితులకు అవసరమైన సమాచారం ఇవ్వడానికి హాస్పిటల్స్ లో హెల్ప్ డెస్క్ లు మరింతగా పటిష్టంగా పని చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జిల్లా యంత్రాంగానికి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, హాస్పిటల్ సూపరింటెండెంట్స్ ను అదేశించారు...


కోవిడ్ హాస్పిటల్స్ లోని హెల్ప్ డెస్క్ ల్లో సరైన సమాచారం లేక పెషేంట్స్ గంధరగోళం పరిస్థితిపై మీడియాలో వచ్చిన కధనంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తక్షణమే స్పందించారు...


జిల్లా వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ లో 24గంటలు పాటు షిఫ్ట్ పద్దతిలో సిబ్బందిని నియమించాలని మంత్రి ఆళ్ల నాని జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ AVR మోహన్,ఇంచార్జి DMHO ను అదేశించారు...


ఈరోజు ఉదయం మంత్రి ఆళ్ల నాని కోవిడ్ హాస్పిటల్స్ లో హెల్ప్ డెస్క్ లు పని తీరుపై సంబందించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, హాస్పిటల్ సూపరింటెండెంట్స్ తో మొబైల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో సమీక్షించారు...జిల్లా కేంద్రమైన ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో హెల్ప్ డెస్క్ జర్మన్ హేంగర్స్ బెడ్స్ ఉన్న ప్రాంతానికి మార్చి అక్కడ నుండి కోవిడ్ అడ్మిషన్స్, డిచార్జీ లు నమోదు చేస్తున్నట్టు DCHS డాక్టర్ AVR మోహన్ మంత్రి ఆళ్ల నానికి ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరించారు...


జిల్లా వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ లో ప్రతి హెల్ప్ డెస్క్ లో ఒక మేనేజర్, ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉంటారని సూపరింటెండెంట్ డాక్టర్ AVR మోహన్ మంత్రి ఆళ్ల నానికి తెలిపారు...


కోవిడ్ హాస్పిటల్స్ అడ్మిషన్స్ తగ్గినా సరే చాలా అప్రమత్తంగా ఉండాలని, ఆక్సిజన్ పైపు లైన్స్, ఆక్సిజన్ నిల్వలు సంబందించిన పనులు నిలిపి వేయవద్దని వాటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి ఆళ్ల నాని అదేశాలు ఇచ్చారు...


ఏ సమయంలో నైనా కోవిడ్ విస్తరించిన సరే పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని, అందుకనే అనుకున్న పనులు త్వరగా పూర్తి అవ్వడానికి ద్రుష్టి పెట్టాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు...


కోవిడ్ హాస్పిటల్స్ లో ఐసియు, నాన్ ఐసియు బెడ్స్ ఆధారంగా ఆక్సిజన్ సదుపాయాలపై కార్యాచరణ ఉండాలని, వివిధ హాస్పిటల్స్ లో ఏర్పాటు చేస్తున్న PSA ఆక్సిజన్ జనరేషన్ నుండి ఈ బెడ్స్ కు ఆక్సిజన్ అందడానికి చర్యలు తీసుకోవాలని, ఆక్సిజన్ కాన్సన్ ట్రైటర్లు ప్రత్యామ్నాయంగా వాడుకోవడానికి కూడ ద్రుష్టి కేంద్రికరించాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు...


బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించడానికి, హాస్పిటల్ కి వచ్చే రోగులకు అవసరమైన వైద్యం అందించడం, ఇంజక్షన్స్ అందుబాటులో ఉంచుకోవడంపై కూడ ద్రుష్టి పెట్టాలని మంత్రి ఆళ్ల నాని అదేశించారు...


బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఇంజక్షన్స్ అందుబాటులో ఉంచడం, అవసరాలకు అనుగుణంగా ఇంజక్షన్స్ లేకపోతే ఇలాంటి పరిస్థితిలో వైద్య పరంగా ఉన్న ప్రత్యామ్నాయాలపై వైద్యులు ప్రత్యేకంగా ఆలోచన చేయాలని మంత్రి ఆళ్ల నాని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు...


బ్లాక్ ఫంగస్ రోగుల కోసం తీవ్రతను బట్టి ఇంజక్షన్స్, మందులు ఎక్కడ ఉన్నా తెప్పించుకోవడంపై ద్రుష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేశించినట్టు మంత్రి ఆళ్ల నాని ఫోన్ కాన్ఫరెన్స్ లో అధికారులకు తెలిపారు...


కరోనా కష్ట కాలంలో దైర్యంగా ప్రజలకు  సేవలు అందిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు...


కరోనా సమయంలో అంకిత భావంతో ప్రజలు కోసం పని చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి కష్టం వస్తే ఎంత ఖర్చు అయినా వెను కాడ కుండా వారి ప్రాణాలు కాపాడడానికి ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నట్టు మంత్రి ఆళ్ల నాని వెల్లడి...


శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్త పుట్టుగ గ్రామానికి చెo దిన డాక్టర్ భాస్కరరావు ప్రకాశం జిల్లా కారంచేడు PHC వైద్యుడుగా పని చేస్తున్నారు...


ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని డాక్టర్ భాస్కర్ రావు కు వైద్యం కోసం ఎంత ఖర్చు అయినా వెనుకాడ వద్దని ఒక కోటి 50లక్షలు సిఎం నిది నుండి వెంటనే మంజూరు చేసి ఫ్రంట్ లైన్ వారియర్స్ అండగా నిలిచారాని పేర్కొన్న మంత్రి ఆళ్ల నాని...


ప్రమాదకరమైన వైరస్ నుండి ప్రజలను కాపాడడానికి వైద్యులు చేస్తున్న నిరంతర పోరాటానికి సిఎం వైస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారని తెలిపిన మంత్రి ఆళ్ల నాని...


ఈ ప్రభుత్వంకు మరింత మంచి పేరు తీసుకు రావడానికి అహర్నిశలు చిత్త శుద్ధితో పని చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని పేర్కొన్న మంత్రి ఆళ్ల నాని...