వైయస్సార్ చేయూత కు సంబంధించి యాప్ లో డేటా ఎంట్రీ పకడ్బందీగా చేపట్టండి

 వైయస్సార్ చేయూత కు సంబంధించి యాప్ లో డేటా ఎంట్రీ పకడ్బందీగా చేపట్టండి 


పిఆర్ అండ్ ఆర్ డి ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది గారు


కర్నూలు, జూన్ 02  (ప్రజా అమరావతి); 


వైయస్సార్ చేయూత కు సంబంధించి యాప్ లో డేటా ఎంట్రీ పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులకు పిఆర్ అండ్ ఆర్ డి ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది గారు ఆదేశించారు. 


బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిఆర్ అండ్ ఆర్ డి ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది గారు వైయస్సార్ చేయూత పథకంపై జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం), డి ఆర్ డి ఎ, మెప్మా, బీసీ వెల్ఫేర్, మైనార్టీ, తదితర సంక్షేమ శాఖ జిల్లా అధికారులతో  సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా పిఆర్ అండ్ ఆర్ డి ప్రిన్సిపల్ సెక్రటరీ  గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్న పథకాలు అమలులో భాగంగా అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించడంలో భాగంగా వైయస్సార్ చేయూత సంబంధించిన లబ్ధిదారులకు ఈనెల 22వ తేదీన ఆర్థిక సహాయం అందజేయనున్నారని వారు పేర్కొన్నారు. వైఎస్సార్ చేయూత పథకం సంబంధించి మీ మొబైల్ లో అప్లికేషన్ లో గత సంవత్సరము అర్హత పొందిన వారి పేర్లు, ఈ సంవత్సరం అర్హత పొందిన వారి పేర్లు ఒకటికి రెండుసార్లు పరిశీలించి డేటా ఎంట్రీ పకడ్బందీగా చేసే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. 


ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) డిఆర్డిఎ పిడి వెంకటేశులు, మెప్మా పిడి ఇంచార్జ్ శిరీష, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ పర్వీన్ భాను, డిఆర్డిఎ ఎపిడి శ్రీధర్ రెడ్డి, తదితర సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నార.

Comments