స్పందన అర్జీల పరిష్కారంలో గడువు వరకు ఆగొద్దు.... గడువుకు ముందే పరిష్కరించండి

 

స్పందన అర్జీల పరిష్కారంలో గడువు వరకు ఆగొద్దు.... గడువుకు ముందే పరిష్కరించండి 


కర్నూలు జిల్లా ఏ అంశంలో పెండింగ్ ఉండకూడదు


స్పందన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి


ఆదివారం నాటికి స్పందన అర్జీలు పరిష్కారం కావాలి


స్పందన అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్


కర్నూలు, జూన్ 10 (ప్రజా అమరావతి):


స్పందన ఫిర్యాదుల పై అధికారులు సకాలంలో స్పందించి గడువు వరకు ఆగకుండా గడువుకు ముందే పరిష్కరించాలని    జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ అధికారులను ఆదేశించారు.


గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుండి స్పందన అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.


సమీక్షలో జేసీ (రెవెన్యూ & రైతు భరోసా) రామసుందర్ రెడ్డి, డి.ఆర్.ఓ పుల్లయ్య, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె బాలాజీ డిఆర్డీఏ పీడీ వెంకటేశులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన ఆర్జీలను గడువు లోపు వంద శాతం పరిష్కారం చేయాలని ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా నిర్ణయించిందన్నారు.స్పందన అర్జీలను నిర్దేశించిన గడువుకు ముందే  వంద శాతం, అర్జీదారుల సంతృప్త స్థాయిలో  పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు. స్పందన అర్జీలు ఎట్టిపరిస్థితిలో పెండింగ్ ఉండకూడదని, వచ్చింది వచ్చినట్లు ఏ రోజుకారోజు పరిష్కరించాలన్నారు. ప్రతిరోజు స్పందన అర్జీ లపై మానిటరింగ్ చేయాలని డి ఆర్ ఓ పుల్లయ్య కు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్పందన అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, నిర్లక్ష్యం వహించకుండా నిర్దేశించిన గడువుకు ముందే పరిష్కరించాలన్నారు. కర్నూలు జిల్లా ఏ అంశంలో పెండింగ్ ఉండకూడదన్నారు. ఆదివారం నాటికి స్పందన అర్జీలు పరిష్కారం కావాలని డి ఆర్ ఓ కు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.


 వైయస్సార్ పెన్షన్ 542 అర్జీలు పెండింగ్లో ఉన్నాయని, ఆదివారం లోపు 50కి తీసుకురావాలని డిఆర్డిఎ పిడి ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రైస్ కార్డులకు సంబంధించి 745 అర్జీలు పెండింగ్లో ఉన్నాయని, పెండింగ్ లేకుండా వాటిని కనీసం 200కు తీసుకురావాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి నాలుగు పెండింగ్లో ఉన్నాయని రేపటి లోపు పరిష్కరించాలని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రూరల్ ఏరియాలో శానిటేషన్ సంబంధించి 12 అర్జీలు పెండింగ్ ఉన్నాయిని వాటిని రేపటి లోపు జీరో తీసుకురావాలని డి పిఓ కు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్బన్ ప్రాంతాల శానిటేషన్ సంబంధించి పదకొండు అర్జీలు పెండింగ్లో ఉన్నాయని, మున్సిపల్ కమిషనర్ల తో మాట్లాడి అర్జీలను పరిష్కరించాలని కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రూరల్ ఏరియా లో వాటర్ సప్లై కి సంబంధించి 9 అర్జీలు పెండింగ్ ఉన్నాయని వాటికి జీరో తీసుకురావాలన్నారు. హౌస్ సైట్ సంబంధించి 23 అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని వాటికి పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. త్రాగునీరు, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్ అంశాలకు, ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వలన్నారు. రైస్ కార్డు, పెన్షన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, హౌస్ సైట్ సంబంధించిన అర్జీలను ఇచ్చిన గడువులోగా వందశాతం పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.  ఆయా మండలాల ఎంపీడీఓ లు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు స్పందన అర్జీల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించ కూడదని కలెక్టర్ స్పష్టం చేశారు..Comments