. తెనాలి (ప్రజా అమరావతి); శ్రీయుత విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్(CS) A. కుమార్ , అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ జమీర్ భాషా , మరియు సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ లక్ష్మణ్ రావు లు తెనాలి టౌన్ లోని చౌక ధరల దుకాణాలు
1,3 మరియు 50 లను తనిఖీ చేసినారు మరియు పినపాడు లో గల ఎల్పిజి గ్యాస్ గూడౌన్ ను తనిఖీ చేసినారు. గ్యాస్ గూడౌన్ వారికి వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు సకాలంలో ప్రభుత్వ ధరలకు అందించాలని అటులనే MDU వాహనదారులకు ప్రతి ఇంటికి వెళ్లి బియ్యం తదితరములు అందించవలెనని తూకం సరిగా ఉండాలని ఆదేశములు ఇచ్చినారు. F.P. డీలర్లు MDU లకు అందుబాటులో ఉండి సరుకులు ఇవ్వాలని ఆదేశించారు . అటులనే తెనాలి డివిజన్ లోని అన్ని F.P. డీలర్లు ఖాళీ గోతాలను తప్పనిసరిగా తిరిగి ఎంఎల్ఎస్ పాయింట్ వారికి అప్పగించాలని Vigilence Deputy Collector (Civil Supplies ) ఆదేశించినారు
addComments
Post a Comment