రెవెన్యూ ఆదాయానికి గండి వేయొద్దు.
సకాలంలో నాలా టాక్స్ కట్టండి.
లేదంటే చర్యలు తప్పవు:తాసిల్దార్ శ్రీనివాసులు రెడ్డి.
(ఎంటిఎంసి)
తాడేపల్లి (ప్రజా అమరావతి);
తాడేపల్లి పట్టణ రూరల్ రెవెన్యూ శాఖకు కట్టవలసిన నాలా ట్రాక్స్ వెంటనే చెల్లించి రెవెన్యూ శాఖకు సహకరించాలని తాడేపల్లి తాసిల్దార్ శ్రీనివాసులు రెడ్డి అన్నారు2016/2021 తేదీ వరకు తాడేపల్లిలో కొత్తగా నిర్మాణాలు చేపట్టిన భవనాలను రెవెన్యూ అధికారులు 200 పైన గుర్తించారని మా విఆర్వోలు కట్టినటువంటి రసీదులు అడిగినప్పుడు చాలామంది ఇది చూపించలేదు నాలా టాక్స్ కట్టినవారు వెంటనే ఈసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకొని ఆ పత్రాలను మాకు అందజేయాలి లేదా తప్పనిసరిగా 50 శాతం అపరాధ రుసుముతో ట్రాక్స్ కట్టవలసి ఉంటుంది సోమవారం నుంచి రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేశాం ఏడు రోజుల లోపల సమాధానం చెప్పండి ఎడల జిల్లా స్థాయిలో చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
రెవిన్యూ సేవలు మీ గ్రామాల్లోనే:-
రెవెన్యూ సేవలు మీ గ్రామంలోని పొందవచ్చు ఇక ముందు ఎవరు తాసిల్దార్ కార్యాలయానికి రావలసిన అవసరం లేదు ప్రతి గ్రామంలో సచివాలయంలోని సేవలు అందిస్తున్నాము గత 15 రోజుల్లో 3800 దరఖాస్తులు ప్రజలకు అందజేసాము అత్యవసరంగా మీ దరఖాస్తులు పరిశీలించాలంటే మీ గ్రామంలో సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న అర్జీ తాలూకా వివరాలు తాసిల్దార్ వాట్సప్ కి పంపిస్తే వెంటనే వాటిని పరిష్కరిస్తాం అని తాసిల్దార్ ప్రజలకు సూచించారు.
addComments
Post a Comment