కరోనా విపత్కర పరిస్థితుల నుండి ప్రతి ఒక్కరిని కాపా డాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరు కున్నాను: గౌ. కేంద్ర రైల్వే శాఖ మంత్రి.

 


*తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న  గౌ. కేంద్ర రైల్వే శాఖ మంత్రి* 


కరోనా విపత్కర పరిస్థితుల నుండి  ప్రతి ఒక్కరిని కాపా డాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరు కున్నాను: గౌ. కేంద్ర రైల్వే శాఖ మంత్రి.




తిరుమల,జూన్ 13 (ప్రజా అమరావతి):

 

ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వారిని   గౌ.కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్,గౌ.రాష్ట్ర ఆర్థిక,ప్రణాళిక, శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్,తిరుపతి పార్ల మెంటు సభ్యులు.ఎం. గురుమూర్తి,ప్రభుత్వ విప్ మరియు చంద్రగిరి శాసనసభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ,

టిటిడి పాలక మండలి మాజీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ల తో కలసి దర్శించు కున్నారు... 

 

స్వామి వారి దర్శనార్థం

ఆలయ మహ ద్వారం వద్దకు చేరుకున్న గౌ.కేంద్ర రైల్వే శాఖ మంత్రి మరియు రాష్ట్ర ఆర్థిక,ప్రణాళిక, శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రులకు టిటిడి అద నపు ఈవో ఏ.వి ధర్మా రెడ్డి స్వాగతం పలికారు


శ్రీ వారి దర్శనానంతరం రంగనాయకుల మండ పంలో వేద పండితుల ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు స్వీకరిం చారు..


అనంతరం ఆలయం వెలుపల గౌ. కేంద్ర రైల్వే శాఖ మంత్రి విలేకరుల తో మాట్లాడుతూ ఈ రోజున ఎంతో పవిత్రత కలిగిన మహత్తరమైన తిరుమల శ్రీ  వెంకటే శ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా నని... ప్రస్తుతం కరోనా తో ఆంధ్రప్రదేశ్ తో సహా భారత దేశ ప్రజలంద రూ ఎంతో  తల్లడిల్లు తున్నారని ,ఈ విపత్కర పరిస్థితుల నుండి ప్రతి ఒక్కరిని కాపాడాలని.. ప్రతి కుటుంబానికి  ఆ వెంకటేశ్వర స్వామి వారి దీవెనలు, ఆశీస్సు లు ఎల్లవేళలా ఉండాల ని, ఆ దేవ దేవుని ప్రార్థించానని.. ప్రజలం దరికీ తప్పకుండా ఆ  ఆశీస్సులు ఉంటా యన్నారు


Comments