విస్టా హాస్పిటల్స్ ప్రారంభోత్సవానికి రావాలంటూ మంత్రి కొడాలి నానికి ఆహ్వానం- విస్టా హాస్పిటల్స్ ప్రారంభోత్సవానికి రావాలంటూ మంత్రి కొడాలి నానికి ఆహ్వానం


 గుడివాడ, జూన్ 12 (ప్రజా అమరావతి): కృష్ణా జిల్లా బంటుమిల్లిలోని మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న షాదీఖానా రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విస్టా హాస్పిటల్స్ ప్రారంభోత్సవానికి రావాలంటూ రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను ఆహ్వానించారు. గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని ప్రముఖ వైద్యులు డాక్టర్ పుప్పాల వీరయ్య కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 వ తేదీ ఉదయం 9 గంటలకు విస్టా హాస్పిటల్ను ప్రారంభిస్తున్నామన్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, బంటుమిల్లి సర్పంచ్ సుజ్ఞానం కృష్ణవేణి, వైసీపీ బంటుమిల్లి మండల నేత సుజ్ఞానం మహేష్ విచ్చేస్తున్నారని చెప్పారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ చేతులమీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని, విశిష్ట అతిథులుగా తక్కెళ్ళ రామ్మోహనరావునాయుడు, కోనా సూర్యనారాయణ, ఎండీ కమాల్ భాషా, వేలూరి వెంకట్రామయ్య, సంగా మధుసూదనరావు, చలమలశెట్టి రమేష్, వెలివల చిన్నబాబు, మలిశెట్టి రాజాబాబు, కొల్లా శేఖర్, తిరుమని శ్రీనివాసరావులు విచ్చేస్తున్నారని తెలిపారు. అనంతరం మంత్రి కొడాలి నానికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, మాజీ కౌన్సిలర్ మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.