రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలి* *జిల్లా కలెక్టర్ జి.వీర పాండియన్.

 రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, గ్రామ సచివాలయాల  భవనాల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలి* *జిల్లా కలెక్టర్ జి.వీర పాండియన్.

 

*పురోగతిలో వెనుక బడిన మండలాలు సోమవారం నాటికి పురోగతి సాధించక పోతే   సంబంధించిన మండలాల ఏ ఈ లపై కఠిన చర్యలు తప్పవు*


*టెలి కాన్ఫరెన్స్ లో సంబంధిత శాఖల ఇంజనీర్లను హెచ్చరించిన  జిల్లా కలెక్టర్ జి.వీర పాండియన్* కర్నూలు, జూన్ 5 (ప్రజా అమరావతి):   జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, గ్రామ సచివాలయాల  భవనాల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని

జిల్లా కలెక్టర్   జి.వీర పాండియన్ ఆదేశించారు.  శనివారం  రైతు భరోసా కేంద్రాలు,వైయస్సార్ హెల్త్ క్లినిక్స్,  గ్రామ సచివాలయాలు తదితర ప్రభుత్వ భవనాల నిర్మాణాల పనుల పురోగతిపై  జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ అమర్నాథ్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ ఈ,  డీఈలు, ఈఈ, ఏ ఈ లతో నియోజక వర్గ వారీగా  జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.


     ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, గ్రామ సచివాలయాల   భవనాల నిర్మాణాలలో కొంత వెనుక బడి ఉన్నామని, ఈ పనులను  వేగవంతంగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. ఆయా మండలాల ఏ ఈ లకు లక్ష్యాలు నిర్దేశించామని, ఆ మేరకు పురోగతి సాధించి, రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కంటె మన జిల్లాను ముందు  నిలిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 


   పురోగతిలో వెనుక బడిన మండలాలు సోమవారం నాటికి పురోగతి సాధించక పోతే   సంబంధించిన మండలాల  ఇంజనీర్ల పై  కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి అధిక ప్రాధాన్యత నిస్తోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు..డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎస్ ఈ , డీఈలు, ఈఈలు పనులు జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనీ, అధికారులు సమన్వయంతో పనిచేసి ఫలితాలను చూపించాలని కలెక్టర్ ఆదేశించారు..రేయింబవళ్ళు పనులు జరిగేలా చూడాలన్నారు..ప్రతి ఏ ఈ తన పరిధిలో ఉన్న  భవన నిర్మాణాల పనులకు  ఇప్పటి వరకు అయిన ఖర్చును  ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు..


 దొర్నిపాడు,పాములపాడు,నందవరం, చిప్పగిరి తదితర మండలాలు పురోగతిలో పూర్తిగా వెనుకబడి ఉన్నాయన్నారు.. ఈ మండలాల్లో ఖచ్చితంగా పురోగతి చూపించాలని, లేని పక్షంలో పురోగతిలో చివరన ఉన్న మూడు మండలాల ఏ ఈ లపై  కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.