గత రెండేళ్ళలో మెరుగైన పనితీరును కనబర్చిన తూనికలు, కొలతల శాఖ

 


- గత రెండేళ్ళలో మెరుగైన పనితీరును కనబర్చిన తూనికలు, కొలతల శాఖ


 

- 2020-21లో రూ.20.58 కోట్ల స్టాంపింగ్ ఫీజులు 

- రూ.10.20 కోట్ల కాంపౌండింగ్ ఫీజుల వసూలు 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, జూన్ 9 (ప్రజా అమరావతి);: రాష్ట్రంలో గత రెండేళ్ళుగా తూనికలు, కొలతల శాఖ మెరుగైన పనితీరును కనబరుస్తూ వస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడలో గత రెండేళ్ళుగా తూనికలు, కొలతల శాఖ సాధించిన మెరుగైన పనితీరును ఆయన మీడియాకు వివరించారు. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రూ.18 కోట్ల 33 లక్షల 102 వేల 707 ల స్టాంపింగ్ ఫీజు వసూలైందని చెప్పారు. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.20 కోట్ల 58 లక్షల 48 వేల 256 లను వసూలు చేసి మెరుగైన ఫలితాలను సాధించడం జరిగిందని, శ్రీకాకుళం జిల్లాలో రూ. 79 లక్షల 27 వేల 745 లు, విజయనగరం జిల్లాలో రూ. 73 లక్షల 12 వేల 875 లు, విశాఖపట్నం జిల్లాలో రూ. 2 కోట్ల 98 లక్షల 49 వేల 172 లు, తూర్పుగోదావరి జిల్లాలో రూ. 2 కోట్ల 40 లక్షల 72 వేల 324 లు, పశ్చిమగోదావరి జిల్లాలో రూ. ఒక కోటి 54 లక్షల 95 వేల 555 లు, కృష్ణాజిల్లాలో రూ. 2 కోట్ల 56 లక్షల 96 వేల 902 లు, గుంటూరు జిల్లాలో రూ.ఒక కోటి 93 లక్షల 18 వేల 158 లు,  ప్రకాశం జిల్లాలో రూ.ఒక కోటి 22 లక్షల 59 వేల 055 లు , నెల్లూరు జిల్లాలో రూ. ఒక కోటి 11 లక్షల 82 వేల 820 లు, చిత్తూరు జిల్లాలో రూ. ఒక కోటి 79 లక్షల 65 వేల 186 లు, వైఎస్సార్ కడప జిల్లాలో రూ. 99 లక్షల 76 వేల 875 లు, అనంతపురం జిల్లాలో రూ.ఒక కోటి 22 లక్షల 53 వేల 460 లు, కర్నూలు జిల్లాలో రూ.ఒక కోటి 25 లక్షల 38 వేల 129 ల స్టాంపింగ్ ఫీజులు వసూలయ్యాయన్నారు. అలాగే 2019-20 ఆర్ధిక సంవత్సరంలో రూ.9 కోట్ల 76 లక్షల 57 వేల 500 ల కాంపౌండింగ్ ఫీజులు వసూలయ్యాయని తెలిపారు. 2020-21లో రాష్ట్రవ్యాప్తంగా రూ. 10 కోట్ల 20 లక్షల 17 వేల 200 లు వసూలు కాగా శ్రీకాకుళం జిల్లాలో రూ. 50 లక్షల 18 వేల 600 లు, విజయనగరం జిల్లాలో రూ.36 లక్షల 97 వేల 900 లు, విశాఖపట్నం జిల్లాలో రూ. ఒక కోటి 23 లక్షల 68 వేల 000 లు, తూర్పుగోదావరి జిల్లాలో రూ. 96 లక్షల 34 వేల 000 లు, పశ్చిమగోదావరి జిల్లాలో రూ.72 లక్షల 12 వేల 500 లు, కృష్ణా జిల్లాలో రూ. ఒక కోటి 29 లక్షల 74 వేల 200 లు, గుంటూరు జిల్లాలో రూ. ఒక కోటి 11 లక్షల 29 వేల 000 లు , ప్రకాశం జిల్లాలో రూ. 81 లక్షల 73 వేల 000 లు, నెల్లూరు జిల్లాలో రూ. 63 లక్షల 21 వేల 200 లు, చిత్తూరు జిల్లాలో రూ.57 లక్షల 67 వేల 600 లు, వైఎస్సార్ కడప జిల్లాలో రూ. 48 లక్షల 73 వేల 000 లు, అనంతపురం జిల్లాలో రూ. 72 లక్షల 52 వేల 100 లు, కర్నూలు జిల్లాలో రూ.53 లక్షల 38 వేల 100 ల కాంపౌండింగ్ ఫీజులు వసూలయ్యాయన్నారు. అలాగే 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఎంఆర్పీ, ఇతర ఉల్లంఘనలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 18 వేల 326 దుకాణాలపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 19 వేల 660 కేసులను నమోదు చేశామని మంత్రి కొడాలి నాని తెలిపారు.