ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ (ప్రజా అమరావతి);
జాతీయ COVID టీకా కార్యక్రమం అమలు మరియు నిర్వహణ కొరకు సవరించిన మార్గదర్శకాలు.
భారతదేశం యొక్క జాతీయ COVID టీకా కార్యక్రమం శాస్త్రీయ మరియు ఆరోగ్య సమస్యల నియంత్రణ యొక్క అధ్యయన ఆధారాలు, WHO మార్గదర్శకాలు మరియు ప్రపంచ ఉత్తమ పద్ధతులు అనుసరించి రూపొందించబడినది.
ఇది సమర్థవంతమైన మరియు క్రమబద్ధమైన ఒక ఎండ్-టు-ఎండ్ ప్రణాళిక ద్వారా రాష్ట్రాలు / యుటిలు మరియు భారతదేశ ప్రజల యొక్క సమర్ధవంతమైన భాగస్వామ్య సహకారముతో తో స్థాపించబడి అమలు చేయబడుచున్నది.
భారత దేశములో ఉన్న ప్రతి వయోజన భారతీయుడికి టీకా కార్యక్రమము ద్వారా వీలైనంత వేగంగా మరియు త్వరగా టీకాలు నిర్వహించడానికి గాను మొదటి నుండి టీకా పరిశోధనలను బలోపేతం చేయడం, వాటిని అభివృద్ధి చేయడం, తయారీని ప్రోత్సహించడం, ప్రారంభించడం మరియు వాటి ఉత్పత్తి సామర్థ్యం పెంచడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత ప్రభుత్వం నిబద్ధత తో కృషి చేసి నిర్వహించుచున్నది.
సవరించిన మార్గదర్శకాలు ప్రకారం దేశం లో ఉన్న వ్యాక్సిన్ తయారీ దారులు ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లలో 75% భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
సేకరించిన వ్యాక్సిన్లు జాతీయ టీకా కార్యక్రమం నిర్వహణ కొనసాగించడానికి రాష్ట్రాలు / యుటిలకు ఉచితంగా అందించబడతాయి.
ఈ టీకాలు రాష్ట్రాలు / యుటిల ద్వారా నిర్వహించబడే ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా ప్రాధాన్యత ప్రకారం పౌరులందరికీ ఉచితంగా అందించబడతాయి.
భారత ప్రభుత్వం రాష్ట్రాల ద్వారా ప్రజలకు ఉచితంగా అందించే టీకాల సంబంధించి కింది విధంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
1.ఆరోగ్య కార్యకర్తలు
2.ఫ్రంట్ లైన్ కార్మికులు
3.45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులు
4. రెండవ మోతాదు పొందని పౌరులు
5.18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులు
రాష్ట్రాలు / యుటి లలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న జనాభా సమూహం చాలా ఎక్కువ ఉంటే వ్యాక్సిన్ సరఫరా షెడ్యూల్ కు సంబందించి రాష్ట్రాలు / యుటి లకు స్వేచ్ఛ ఇవ్వబడినది.
రాష్ట్రాలు / యుటిలకు జనాభా, వ్యాధి ప్రభావం మరియు టీకా నిర్వహణ యొక్క పురోగతి వంటి ప్రమాణాల ఆధారంగా వ్యాక్సిన్ మోతాదులను భారత ప్రభుత్వం ఉచితంగా కేటాయించి అందిస్తుంది. ఏదేని రాష్ట్రాలు / యుటిలు నిర్వహించే టీకా నిర్వహణ లో వృధా కనుగొంటే అది తదుపరి కేటాయింపులో ప్రతికూల ప్రభావితం చేస్తుంది.
భారత ప్రభుత్వం రాష్ట్రాలు / యుటిలకు టీకాల మోతాదు మరియు వాటి సరఫరా కు సంబందించి ముందస్తు సమాచారాన్ని ఇస్తుంది. రాష్ట్రాలు / యుటిలు కూడా అదేవిధంగా జిల్లా కేంద్రాలకు మరియు టీకా కేంద్రాలకు టీకాల మోతాదు మరియు వాటి సరఫరా కు సంబందించి ముందస్తు సమాచారాన్ని అందించాలి. వచ్చిన సమాచారం అనుసరించి టీకాల లభ్యత గురించి జిల్లా మరియు టీకా కేంద్రం స్థాయిలో స్థానిక జనాభాలో దృశ్యమాన త సౌలభ్యాన్ని పెంచడానికి మరియు విస్తృతంగా వ్యాప్తి కొరకు పబ్లిక్ డొమైన్లో కూడా ఉంచాలి.
టీకా ఉత్పత్తికి, కొత్త టీకాలను కనుగొనడానికి టీకా తయారీ దారులను ప్రోత్సహించడం జరుగుతుంది. దేశీయ వ్యాక్సిన్ తయారీ దారులకు మాత్రమే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులకు నేరుగా వ్యాక్సిన్‌లను అందించే అనుమతి ఇవ్వబడుతుంది. ఇది వారి నెలవారీ ఉత్పత్తిలో 25% కి మాత్రమే పరిమితం చేయబడింది.
రాష్ట్రాలు / యుటిలు పెద్ద మరియు చిన్న ప్రైవేటు ఆసుపత్రుల మరియు ప్రాంతాల మధ్య పంపిణీ డిమాండ్ సంతులనం సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఈ సమగ్ర డిమాండ్ ఆధారంగా మరియు నేషనల్ హెల్త్ అథారిటీ యొక్క ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫాం చెల్లింపుల ద్వారా ఈ టీకాలను భారత ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు సరఫరా చేస్తుంది. ఈ విధానం ద్వారా చిన్న మరియు రిమోటర్ ప్రైవేట్ ఆసుపత్రులు ప్రాంతీయ సంతులనం అనుసరించి వ్యాక్సిన్ల సకాలంలో పొందటానికి వీలు కల్పిస్తుంది.
ప్రైవేట్ ఆస్పత్రులకు సరఫరా చేసే వ్యాక్సిన్ మోతాదుల యొక్క ధర ప్రతి ఒక్క టీకా తయారీ దారులు ఇప్పటికే ప్రకటించారు. ధర విషయములో ఏదైనా తదుపరి మార్పులు చేర్పులు ఉంటే అడ్వాన్స్ గా తెలియ చేయబడతాయి.
ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహించే ప్రతి ఒక్క టీకా నిర్వహణ కు సర్వీస్ చార్జి కింద గరిష్టంగా 150 రూపాయల వరకు వసూలు చేసుకోవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహించే టీకా నిర్వహణ కు సంబందించి వసూలు చేసే సర్వీస్ చార్జ్ ఎలా వసూలు చేయబడుతోంది పర్యవేక్షించాలి.
దేశం లో ఉన్న పౌరులందరికీ వారి ఆదాయ పరిస్థితితో సంబంధం లేకుండా టీకా ఉచితం గా అందించబడుతుంది. టీకాకు డబ్బు చెల్లించే సామర్థ్యం ఉన్నవారికి ప్రైవేట్ ఆసుపత్రి టీకా కేంద్రాలు ఉపయోగించమని ప్రోత్సహించాలి.
ఆర్థికపరమైన బలహీన విభాగాల ప్రజలు ప్రైవేట్ టీకా కేంద్రాలలో టీకా పొందుటకు గాను వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించడానికి ఆర్దికముగా స్థిరపడిన ప్రజలలో స్పూర్తి నింపి ప్రోత్సహించడానికి బదిలీ చేయబడలేని “లోక్ కల్యాణ్” అనే ఎలక్ట్రానిక్ రిడీమ్ వోచర్లు అనేవి ప్రతీ ప్రైవేట్ టీకా కేంద్రాలలో అందుబాటులో ఉంచడం జరిగింది.
కోవిన్ ప్లాట్ ఫాం దేశం లో ఉన్న ప్రతి పౌరుడికి టీకాల అపాయింట్‌మెంట్ సౌకర్యమంతగా మరియు సురక్షితంగా నిర్వహించుకునేందుకు ముందస్తు బుకింగ్ అందిస్తుంది. దేశం లో ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ టీకా కేంద్రాలు ఆన్‌సైట్ నమోదు సౌకర్యాన్ని అందిస్తాయి. ఈ సౌకర్యం ఉపయోగించుకొనుటకు మరియు ఈ సౌకర్యం ఉపయోగించుకునే సందర్భం లో ఏర్పడే అసౌకర్యాన్ని నివారించుటకు దీనికి సంబందించి వివరణాత్మక విధానాన్ని రాష్ట్రాలు / యుటిలు ఖరారు చేసి ప్రచురించి వ్యక్తులకు మరియు వ్యక్తుల సమూహాలకు అందుబాటులో ఉంచాలి.
పౌరుల టీకా ముందస్తు బుకింగ్ ను సులభతరం చేయడానికి రాష్ట్రాలలో నిర్వహించబడే సాధారణ సేవా కేంద్రాలు మరియు కాల్ సెంటర్ల సేవలను కూడా వీటికి నియోగించుకోవచ్చు.
పైన తెలిపిన మరియు సవరించిన టీకా కార్యక్రమం కు సంబందించి నిధులు సేకరణ మరియు టీకా రవాణా కేంద్రం ప్రభుత్వ అదనపు మద్దతు తో దేశమంతటా ఉన్న రాష్ట్రాలు / యుటిలకు అందిస్తుంది. అంతే కాకుండా శాస్త్రీయ ప్రాధాన్యత, వ్యాక్సిన్ విస్తృత లభ్యత, ప్రైవేట్ రంగ సామర్థ్యాన్ని ఉపయోగించడం మరియు రాష్ట్ర మరియు స్థానిక స్థాయిలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ని సులభతరం చేస్తుంది.
సవరించిన ఈ మార్గదర్శకాలు 2021 జూన్ 21 నుండి అమల్లోకి వస్తాయి,మరియు ఇవి ఎప్పటికప్పుడు సమీక్షించబడతాయి.
*డాక్టర్ అర్జా శ్రీకాంత్*
ఏపీ కోవిద్ నోడల్ ఆఫీసర్
addComments
Post a Comment