మహిళా సాధికారతలోనూ దేశంలో నంబర్ 1.. 50 శాతానికి పైగానే మహిళలకు పదవులు



*మంత్రులు శ్రీ ధర్మాన కృష్ణదాస్, శ్రీ నారాయణస్వామి, శ్రీ శంకరనారాయణ, శ్రీ అప్పలరాజు ప్రెస్ మీట్స్ పాయింట్స్..*

- రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి మాట్లాడిన మంత్రులు


*- మహిళా సాధికారతలోనూ దేశంలో నంబర్ 1.. 50 శాతానికి పైగానే మహిళలకు పదవులు*

*- నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఏపీలో సామాజిక న్యాయం అమలు*

*- కొత్త తరం రాజకీయాలను తెస్తోన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్*

*- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, పేదలకు శ్రీ వైయస్ జగన్ పరిపాలన సువర్ణయుగం*

*- 14 ఏళ్ళ పరిపాలనలో అణగారిన వర్గాలను చంద్రబాబు ఏనాడైనా మనుషులుగా చూశాడా..?*

*- ఇచ్చిన మాటకు మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పదవులు*

*- అణగారిన వర్గాల గుండె చప్పుడు తెలిసిన సీఎం శ్రీ జగన్*

*- మహాత్ములు చూపిన బాటలో ముందడుగు వేస్తోన్న సీఎం శ్రీ జగన్*


ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, పేదలకు జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలన ఒక సువర్ణయుగం అని రాష్ట్ర మంత్రులు శ్రీ ధర్మాన కృష్ణదాస్, శ్రీ కె. నారాయణ స్వామి, శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ, శ్రీ సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అణగారిన వర్గాలకు జగన్ మోహన్ రెడ్డిగారు పెద్దఎత్తున రాజకీయ పదవులు కట్టబెట్టి, ఆ వర్గాలకు సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని కల్పించారని అన్నారు. తాజాగా ప్రకటిచిన 137 రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్, కార్పొరేషన్  పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం ఇచ్చారని గుర్తు చేశారు. అందులో 50 శాతానికి పైగా మహిళలకు పదవులు ఇచ్చారన్నారు. మహిళా సాధికారతలో ఏపీ దేశంలో నంబర్ 1గా ఉందని చెప్పారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ళు ముఖ్యమత్రిగా పనిచేశానని అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డులా పదే పదే చెప్పుకునే చంద్రబాబు నాయుడు, తన హయాంలో అణగారిన వర్గాలకు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు కనీసం మనుషులుగా చూశాడా.. అని మంత్రులు ప్రశ్నించారు. 


రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి మంత్రులు మీడియా సమావేశాల్లో మాట్లాడారు. అంబేడ్కర్, పూలేలు కలలుగన్న సామాజిక న్యాయం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి శ్రీ జగన్ పరిపాలనలో కనిపిస్తోందన్నారు. ఎన్నికలకు ముందు సీట్ల కేటాయింపు నుంచి పదవుల పంపిణీ వరకూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు సమ న్యాయం చేశారని మంత్రులు కొనియాడారు. నామినేటెడ్‌ పదవుల్లో అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి న్యాయం చేశారని ప్రశంసలు కురిపించారు. ఇంతకాలం ఓటు బ్యాంకు రాజకీయాలకు తప్పితే.. రాజకీయ పదవులకు అక్కరకురాని వర్గాలకు ముఖ్యమంత్రి శ్రీ జగన్ పూర్తి న్యాయం చేశారని, బహుశా దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇలా జరిగి ఉండదని అన్నారు. నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ లో సామాజిక న్యాయం అమలు జరుగుతోందని, తనకు తానే సాటి అన్నట్లుగా జగన్ గారు కొత్త తరం రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నారన్నారు.


*రాజకీయ పదవుల్లో బీసీలకు పెద్ద పీట: డిప్యూటీ సీఎం శ్రీ ధర్మాన కృష్ణదాస్‌*


శ్రీకాకుళంః 

మొదటి నుంచీ పార్టీ కోసం కష్టపడినవారిని, అంకితభావంతో పనిచేసిన వారికి పదవులు ఇచ్చి వారిని గౌరవించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల ప్రకటనలో పారదర్శకతతో పాటు అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పించడం చూసి రాష్ట్రం యావత్తు హర్షం వ్యక్తం చేస్తోందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు గతంలో ఎప్పుడూ చూడని, ఎన్నడూ వినని విధంగా ఉప ముఖ్యమంత్రుల పదవులు ఇచ్చారన్నారు. మరోవైపు నామినేటెడ్ పోస్టుల్లో పురుషుల కంటే మిన్నగా ఒక సీటు అధికంగా ఇచ్చి మహిళలకు సముచిత స్థానం కల్పించారన్నారు. కష్టపడి పనిచేసేవారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు.


1. 2019 ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు దాదాపు 60 శాతానికిపైగా సీట్లు కేటాయించి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు శ్రీ జగన్. సమర్థతకు సమన్యాయానికి మారుపేరుగా నిలిచిన వైఎస్‌ జగన్‌ గారు జాతీయ సర్వేలలోనూ సమర్థవంతమైన సీఎం ర్యాంకుల్లో మూడవ స్థానంలో ఉండటం గర్వకారణం.  


2.  రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా బీసీలకు రాజకీయ పదవుల్లో పెద్ద పీట వేశారు. మంత్రివర్గం కూర్పు నుంచి నామినేటెడ్ పదవుల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దఎత్తున పదవులు కేటాయించడం ద్వారా జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి జగన్ గారు అందరి దృష్టిని ఆకర్షించారు.  ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కేటాయించారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఆరు కార్పొరేషన్‌ పదవులు ఇచ్చారు.


3. అసెంబ్లీ స్పీకర్ పదవినీ బీసీ వర్గానికి ఇచ్చారు. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని శాసనసభలో బిల్లు ఆమోదించి చట్టం తెచ్చిన జగన్ గారు.. అమలులో అంతకు మించి ఇస్తున్నారన్నారు. దేవాలయాలు, మార్కెట్ కమిటీలు, ఇతర పాలక మండళ్లలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు అత్యధికంగా పదవులు ఇచ్చారు.


4. రాష్ట్రంలో తొలిసారిగా బీసీ వర్గాల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఛైర్మెన్లు, కమిటీ సభ్యుల పదవులను కేటాయించారు. మాల, మాదిగ, రెల్లి కులాలకు వేర్వేరు కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేశారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సత్‌ సంకల్పంతో జగన్‌ మోహన్‌ రెడ్డిగారు పనిచేస్తున్నారు.

.................

*ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను బాబు ఎప్పుడైనా మనుషులుగా చూశాడాః డిప్యూటీ సీఎం కె. నారాయణ స్వామి*


తిరుపతిః 

1- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలను అటు అధికారంలోనూ.. ఇటు సంక్షేమ కార్యక్రమాల్లోనూ పెద్దఎత్తున భాగస్వామ్యులను చూసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ గారు. గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు,  ఏనాడూ అయినా ఇటువంటి కార్యక్రమాలు అమలు చేశాడా.. ఈ వర్గాలను అసలు మనుషులుగా చూశాడా..

2- చంద్రబాబు వల్ల ఒక దళితుడిగా నేను ఇబ్బంది పడ్డాను. 

3- టీడీపీగానీ, చంద్రబాబుగానీ ఎప్పుడూ హరిజనవాడకు వెళ్ళి ఓటు అడిగే పరిస్థితే లేదు. ఎస్సీలను చంద్రబాబు మొదటి నుంచీ దూరం పెట్టేవాడు.

4- టీడీపీలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు ఇప్పటికైనా ఆలోచించాలి. 

5- ఈరోజు జగన్ మోహన్ రెడ్డిగారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, అగ్రవర్ణాల్లోని పేదలకు అందిస్తున్న  సంక్షేమ కార్యక్రమాలను ఎప్పుడైనా చూశారా.. 

6- చంద్రబాబు మాట్లాడితే.. అభివృద్ధి ఏం జరిగిందని అంటున్నాడు. పేదవాడికి సంక్షేమ పథకాలు ఇచ్చేది, ఇంగ్లీషు మీడియం చదువులు చదివించి విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేసేది, పక్కా ఇళ్ళు కట్టించేది.. ఇవన్నీ చంద్రబాబుకు అభివృద్ధిలా కనిపించడం లేదా.. అభివృద్ధి అంటే చంద్రబాబు దృష్టిలో తన మనుషులు బాగుపడటమా..

7- కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.

8- 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏం చేశాడో చెప్పాలి. చేతులు జోడించి చంద్రబాబును అడుగుతున్నాను. 

9- చంద్రబాబు మానవత్వం లేని వ్యక్తి.  రోడ్డు వేసి, పించను ఇచ్చి.. అన్నీ నేనే చేశాను అని చంద్రబాబు నంద్యాల ఎన్నికల ప్రచారంలో చెప్పాడు.  పేదలకు ఇన్ని చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిగారు ఏరోజైనా అలా చెప్పారా..

-------

*అణగారిన వర్గాల గుండె చప్పుడు తెలిసిన సీఎం శ్రీ జగన్: మంత్రి అప్పలరాజు*


శ్రీకాకుళంః

ఎన్నికల్లో సీట్ల కేటాయింపు నుంచి పదవుల పంపిణీ వరకూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అన్ని వర్గాలకు సమ న్యాయం చేశారని పశు సంవర్ధక, మత్స్య, మార్కెటింగ్‌ శాఖమంత్రి అప్పలరాజు అన్నారు. దేశంలో అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని అక్కున చేర్చుకుని, పక్కన కూర్చోపెట్టుకుని, అధికారాన్ని పంచి ఇచ్చిన ఘటన ఇప్పటివరకూ చరిత్రలో కనిపించలేదని.. అలాంటిది ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు  పెద్దపీట వేశారని అన్నారు.   


1. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు ఇంతకాలం రాజ్యాధికారానికి, రాజకీయ ప్రాతినిధ్యానికి దూరంగా ఉండి, వెనకబడిపోయిన అణగారిన వర్గాలకు ముఖ్యమంత్రి రాజకీయ అధికారం కల్పించారు. సామాజిక న్యాయం సాధన దిశగా సీఎం జగన్‌ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించారు. 


2. ఓదార్పు యాత్ర, పాదయాత్ర ద్వారా జగన్‌ మోహన్‌ రెడ్డిగారు నేరుగా ​లక్షలాదిమందిని కలిశారు. అణగారిన వర్గాల జీవితాలను ఆయన దగ్గరగా చూసి తెలుసుకున్నారు. దేశంలో ఏ నాయకుడు కూడా అడుగు పెట్టినటువంటి పూరి గుడిసెల్లో కూడా అడుగుపెట్టిన ఆయన పేదల గుండె చప్పుడు సైతం చూశారు.  


2. స్థానిక సంస్థల నుంచి రాజ్యసభ వరకు బీసీలకు అగ్ర స్థానం కల్పించడం ద్వారా అన్నివర్గాలకు ముఖ్యమంత్రి న్యాయం చేశారు. ఇన్నాళ్లకు మా కల నెరవేరింది. వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాధికారంలో వాటా దక్కిందని భావన మాకు కలుగుతుంది. 

......................


*మహాత్ములు చూపిన బాటలో ముందడుగు వేస్తోన్న సీఎం శ్రీ జగన్: మంత్రి శంకర నారాయణ*


అనంతపురంః

1. బీఆర్‌ అంబేడ్కర్‌, జ్యోతిరావు పూలే కలలుగన్న సమ సమాజం, గ్రామ స్వరాజం కోసం వారు చూపిన బాటలో, ఒక అడుగు ముందుకు వేసి పని చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి దక్కుతుంది. నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారని గర్వంగా చెప్పవచ్చు.


2. గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు,  వెనుకబడిన, అణగారిన వర్గాల ప్రజలను కేవలం ఓటు బ్యాంక్‌ గా మాత్రమే చూసేవారు. అలాంటిది ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అన్నివర్గాలను సమానంగా చూడటమే కాకుండా వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. మహిళలకు అత్యధిక పదవులు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దే. జగన్‌ మోహన్‌ రెడ్డిగారి సమ న్యాయ పాలనతో చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారు.


3. అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులోను  అణగారిన వర్గాల ఆర్థిక పురోభివృద్ధి, గౌరవం, రాజకీయ ఉన్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. తన క్యాబినెట్ లో 60 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించారు.


4. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా వెనకబడిన వర్గాల కోసం రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.


5. అనంతపురం జిల్లాలో కురుబ కులానికి చెందిన తనకు మంత్రి పదవి ఇచ్చి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, వారి బాధలు తీర్చాలని, వారిని సంతోషంగా ఉంచాలని తన పాదయాత్ర హామీలను నెరవేరుస్తూ ఇచ్చిన మాటను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదికాలాలపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు.

Comments