జిల్లాలో 2021-22 సంవత్సరానికి మొదటి విడతలో 625 మందికి మీడియా అక్రిడిటేషన్లు మంజూరు



*జిల్లాలో 2021-22 సంవత్సరానికి  మొదటి విడతలో 625 మందికి మీడియా అక్రిడిటేషన్లు మంజూరు


:-*


*జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ *


కడప, జులై 24 (ప్రజా అమరావతి);


జిల్లాలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేయుచున్న వర్కింగ్ జర్నలిస్ట్ లకు 2021-22 సంవత్సరానికి  మొదటి విడతలో 625 మందికి మీడియా అక్రిడిటేషన్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్  సి.హరికిరణ్ తెలిపారు.


శనివారం  స్థానిక కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క అక్రిడిటేషన్ దరఖాస్తును కూడా తిరస్కరించ లేదన్నారు. జి.ఓ.ఎం.ఎస్ నెంబర్ 142 లో ఉన్న అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించి, అర్హత ఉన్న జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఇవ్వడానికి కమిటీ అంగీకారం తెలిపిందన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలో అర్హత ఉన్న 625 మంది జర్నలిస్టులకు మొదటి విడతలో అక్రిడిటేషన్ లు మంజూరు చేశామన్నారు. అక్రిడిటేషన్ మంజూరు కానివారు రాష్ట్ర సమాచార శాఖ వెబ్ సైట్ లో వెంటనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, సదరు కాపీలను కడప సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు.. అనంతరం అప్లోడ్ చేసిన దరఖాస్తులను పరిశీలన చేసి తదుపరి సమావేశంలో అర్హత ఉన్న వారికి అక్రిడిటేషన్ మంజూరుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.


ఈ సమావేశంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటి సభ్యులు  గృహనిర్మాణ శాఖ పీడి రాజశేఖర్, అక్రిడిటేషన్ కమిటి కన్వీనర్ , సమాచార పౌర సంబంధాల శాఖ, సహాయ సంచాలకులు పి.వేణుగోపాల్ రెడ్డి, ఐఅండ్ పిఆర్ డిఈ భరత్ కుమార్ రెడ్డి, సభ్యులు డీఎంహెచ్ ఓ,  కార్మిక శాఖ  , సౌత్ సెంట్రల్ రైల్వే, ఏపీఎస్ఆర్టీసీ , వాణిజ్య శాఖ ..  నుంచి  సభ్యులు..తదితరులు పాల్గొన్నారు.


Comments