కాకాణి చేతులు మీదుగా మహిళలకు 37 కోట్లు పంపిణీ.

 కాకాణి చేతులు మీదుగా మహిళలకు 37 కోట్లు పంపిణీ.


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలో మహిళల శిక్షణా నిమిత్తం 95 లక్షల రూపాయలతో చేపట్టనున్న కమ్యూనిటీ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .

సర్వేపల్లి నియోజకవర్గంలోని సంఘబంధాల మహిళలకు 27 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కును 10 కోట్ల రూపాయల "స్త్రీనిధి" చెక్కును జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ కె.వి.సాంబశివారెడ్డి గారితో కలిసి అందించిన ఎమ్మెల్యే కాకాణి.

సరస్వతి నగర్ కమ్యూనిటీ సెంటర్లో ఏర్పాటు చేసిన "వై.యస్.ఆర్.క్రాంతి పథం" సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సులో పాల్గొని, సర్వేపల్లి నియోజకవర్గానికి 2సంవత్సరాల కాలవ్యవధిలో "1,819" కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వివరాలు, గణాంకాలతో సహా ప్రకటించిన ఎమ్మెల్యే కాకాణి.

జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను అధికార పార్టీ శాసనసభ్యునిగా రెండు సంవత్సరాల కాల వ్యవధిలో *"1,819 కోట్ల"* రూపాయలతో సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం.

 సర్వేపల్లి నియోజకవర్గంలో *"587 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు"*, *"1,232 కోట్ల రూపాయలతో అభివృద్ధి"* కార్యక్రమాలకు నిధులు మంజూరు చేశాం.

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రకటించిన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల్లో కూడా 50 శాతం మహిళలకు కేటాయించి, *"మహిళా పక్షపాతి"* గా నిలిచారు.

 రాష్ట్రస్థాయి కార్పొరేషన్లను *"57 శాతం ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ"* లకు కేటాయించి, సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.

 కోవిడ్ నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆర్థిక సహాయం అందించి, అండగా నిలవాలనే లక్ష్యంతో, క్రమం తప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రిగారు అమలు చేస్తున్నారు.

 గ్రామ సమాఖ్య సహాయకులకు చంద్రబాబు ప్రభుత్వంలో *రూ.2,000/-లు* గౌరవ వేతనం చెల్లిస్తే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు *రూ.10,000/-లకు* పెంచడం జరిగింది.

 చంద్రబాబు సంఘబంధ సభ్యులను తన సభలకు ప్రేక్షకులుగా ఉపయోగించుకొని, రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి, రుణమాఫీ చేయకుండా మోసం చేశాడు.

 జగన్మోహన్ రెడ్డిగారు *"వైయస్సార్ ఆసరా"* పేరిట మహిళలు బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలను 4విడతల్లో చెల్లించేందుకు ముందుకు రావడమే కాకుండా, *"వైయస్సార్ చేయూత"* పేరిట 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు రూ.75,000/-ల ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

 సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు సంవత్సరాల కాలవ్యవధిలో *"వైయస్సార్ పెన్షన్ కానుక" ద్వారా 37,210 కుటుంబాలకు 209 కోట్ల రూపాయలు* అందజేశాం.

 చంద్రబాబు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయకుండా మోసం చేస్తే, ప్రకటించిన హామీలను అన్నింటినీ అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం విడ్డూరం.

సర్వేపల్లి నియోజకవర్గంలోని మహిళలందరికీ *"అన్నతమ్ముడి"* గా నియోజకవర్గ ప్రజలకు *"ఇంటి బిడ్డ"* గా, నాకు రెండు సార్లు శాసనసభ్యునిగా అవకాశమిచ్చిన వారందరి రుణం తీర్చుకోవడానికి నా శాయశక్తులా కృషి చేస్తా.

Comments