*_రైతు ఉత్పత్తులు పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేయాలని ప్రభుత్వ లక్ష్యం --- రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
._*
*మార్కెటింగ్ శాఖ అధికారులను సూచించిన మంత్రి.*
*పలాస వ్యవసాయ మార్కెటింగ్ యార్డును సందర్శించిన మార్కెటింగ్ ఎస్.ఇ.*
పలాస జులై 21 (ప్రజా అమరావతి):
పలాస నియోజకవర్గంలో రైతు ఉత్పత్తులు పూర్తి స్థాయిగా మార్కెటింగ్ జరిగేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అధికారులను సూచించారు. బుధవారం పలాస వ్యవసాయ మార్కెట్ వయార్డు పరిశీలను వచ్చిన మార్కెటింగ్ ఎస్.ఇ శ్రీనివాసరావు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి మార్కెట్ యార్డులో నిర్మాణం అవుతున్న పనులు, మరికొన్ని అంశాలపై చర్చించారు. రైతు పండించే పంటలు మార్కెట్ చేయాలంటే వారు పండించే పంటలు స్టోర్ చేసుకుని లాభసాటి ధరలు వచ్చేటప్పుడు అమ్ముకునే సౌలభ్యం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తుందని తెలిపారు. పలాస వ్యవసాయ మార్కెటింగ్ యార్డులో కోల్డ్ స్టొరేజి పనులు ఎంతవరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. రైతు పంటలు నిల్వాచేసుకునేందుకు గోదాములు నిర్మాణం విషయమై పరిశీలన చేస్తున్నామని అధికారులు మంత్రికి తెలిపారు. ప్రస్తుతం రెండు వేల మెట్రిక్ టన్నుల నిల్వా కెపాసిటి కల్గిన గొదాముల నిర్మాణం పరిశీలించామని అన్నారు. అలాగే మందస మండలం లోని సబ్ మార్కెట్ యార్డు సందర్శించి అక్కడ పరిస్థితులు మంత్రి డాక్టర్ అప్పలరాజుకు వివరించారు. రైతు ఉత్పత్తులు మార్కెటింగ్ చేసి ఆర్దీక భరోసా కల్పించేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీలు పూర్తి స్థాయిగా పనిచేయాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ అప్పలరాజు అధికారులను కోరారు. పలాస నియోజకవర్గం రైతులకు కోల్డ్ స్టోరేజి ఒక వరం అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడని. రైతు ఆర్ధికంగా బాగుండాలనే కోరుకునే రైతు బంధు అని అన్నారు. ముఖ్యమంత్రి ఆశయ సాధనకు అధికారులు శక్తివంచన లేకుండా కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు తీసుకురావాలని కోరారు. మంత్రి కలిసే ముందు. పలాస వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డును మార్కెటింగ్ శాఖ ఎస్.ఇ. శ్రీనివాసరావు, ఇ.ఇ జయశేఖర్, డి.ఇ డి. కోటయ్య, సెక్రటరీ చంద్రమౌళి లు మార్కెట్ యార్డును సందర్శించారు.
కోల్డ్ స్టోరేజి గొడౌన్ నిర్మాణానికి సంబందించిన స్థల పరిశీలన చేశారు. అనంతరం మర్యాదపూర్వకంగా మంత్రిని కలిసి మార్కెట్ యార్డులో జరుగుతున్న పనులు, జరగబోవు పనులు కోసం చర్చించారు.
addComments
Post a Comment