బదిలీ చేయించాలని మంత్రి కొడాలి నానికి వినతి- బదిలీ చేయించాలని మంత్రి కొడాలి నానికి వినతి 
- గుడివాడ, జూలై 28 (ప్రజా అమరావతి): గుంటూరు జిల్లా నిజాంపట్నంలోని బీసీ వెల్ఫేర్ బాలుర పాఠశాలలో ఎంపీడబ్ల్యూగా పనిచేస్తున్న డీ తులసి తనను బదిలీ చేయించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను కోరారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని బీసీ వెల్ఫేర్ బాలుర పాఠశాల ఎంపీడబ్ల్యూ తులసి కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2018 నుండి పనిచేస్తున్నానని, చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన కే మోహన్తో త్వరలో వివాహం జరగనుందని చెప్పారు. నిజాంపట్నం నుండి నెల్లూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఎక్కడికైనా బదిలీ చేయించాలని కోరారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడతానని చెప్పారు. ఎంపీడబ్ల్యూగా పనిచేస్తున్న తులసి అర్హతలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరతానని మంత్రి కొడాలి నాని తెలిపారు.