సామాజిక న్యాయంలో సువర్ణయుగం
నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు 58 శాతం పదవులు
అమరావతి (ప్రజా అమరావతి):
వివిధ కార్పొరేషన్లకోసం ప్రకటించిన పదవుల సంఖ్య మొత్తంగా 137
ఇందులో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తంగా 79 పదవులు
ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలకు చరిత్రలో తొలిసారిగా 58 శాతం పదవులు
మహిళలకు అధికంగా దక్కిన పదవులు, 50.4శాతం పదవులు
137లో 69 పదవులు మహిళలకు దక్కగా, 68 పదవులు పురుషులకు దక్కాయి.
జిల్లాలవారీగా చూస్తే...
– 13 జిల్లాల్లోని ఏ జిల్లాలోకూడా ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల వర్గానికి 50శాతం తగ్గకుండా పదవులు వచ్చాయి.
– శ్రీకాకుళంలో 7 పదవులు ఇవ్వగా 6 పదవులు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దక్కాయి. ఆ జిల్లాకు ఇచ్చినదాంట్లో 86శాతం పదవులు వారికే లభించాయి.
– విజయనగరం జిల్లాలో 8 మందికి పదవులు రాగా, 6 పదవులు, 75శాతం ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దక్కాయి.
– విశాఖపట్నం జిల్లాలో 11 మందికి పదవులు రాగా, ఎస్సీ–ఎస్టీ–బీసీ–మైనార్టీలకు 7 పదవులు, 64శాతం పదవులువారికి దక్కాయి.
– తూర్పుగోదావరి జిల్లాలో 17 మందికి పోస్టులు ఇవ్వగా, 9 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దక్కాయి. 53శాతం పదవులు వారికి లభించాయి.
– ప.గో.జిల్లాలో 12 మందికి కార్పొరేషన్‌ఛైర్మన్లు ఇవ్వగా, ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు 6 పదవులు దక్కాయి. 50శాతం పదవులు వారికే లభించాయి.
– కృష్ణా జిల్లాలో 10 మందికి పదవులు ఇస్తే, వారిలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్గీలకు 6 పదవులు వచ్చాయి. 60శాతం పదవులు వారికి లభించాయి.
– గుంటూరులో 9 మందికి కార్పొరేషన్ పదవులు ఇస్తే, అందులో 6గురు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు 67శాతం పదవులు దక్కాయి.
– ప్రకాశం జిల్లాలో 10 మందికి పదవులు ఇస్తే.. వారిలో 5 పదవులు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు 50శాతం పదవులు వచ్చాయి.
– నెల్లూరు జిల్లాలో 10 పదవులు ఇస్తే.. వారిలో 5 పదవులు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీకలు వచ్చాయి. 50శాతం పదవులు వారికే వచ్చాయి.
– చిత్తూరు జిల్లాలో 12 మందికి కార్పొరేషన్ ఛైర్మన్లు పదవులు ఇవ్వగా, వారిలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు 7 పదవులు దక్కాయి. 58 శాతం పదవులు వారికే వచ్చాయి.
– అనంతపురం జిల్లాలో 10 మందికి పదవులు ఇవ్వగా, సగం పదవులు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు.. అంటే 50శాతం పదవులు వచ్చాయి
– కడపలో 11 మందికి పదవులు ఇస్తే.. అదులో 55శాతం అంటే 6 పదవులు ఎస్సీ,ఎస్టీ,బీసీలకు లభించాయి.
– కర్నూలులో 10 మందికి పదవులు ఇస్తే, వారిలో 50శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు లభించాయి.
addComments
Post a Comment