జగనన్న పచ్చతోరణం కింద విరివిగా మొక్కలు నాటాలి

 జగనన్న పచ్చతోరణం కింద విరివిగా మొక్కలు నాటాలి*


*: మొక్కల సంరక్షణ కూడా జాగ్రత్తగా చేపట్టాలి*


*: జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ గారు*


 పరిగి, జూలై 28 (ప్రజా అమరావతి):

జగనన్న పచ్చతోరణం కింద విరివిగా మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. బుధవారం పరిగి మండల దగ్గరున్న సుబ్బరాయుని గుడి వద్ద బ్లాక్ ప్లాంటేషన్ లో భాగంగా జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. అలాగే పరిగి నుంచి శ్రీ రంగరాజపల్లి పల్లి వరకు రోడ్డుకిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  జగనన్న పచ్చతోరణం కింద చేపట్టిన బ్లాక్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్, హార్టికల్చర్ ప్లాంటేషన్ లో భాగంగా ఆగస్టు 15 లోపల 100 శాతం మొక్కలు నాటడం చేపట్టాలన్నారు. నాటిన మొక్కల సంరక్షణ కూడా జాగ్రత్తగా చేపట్టాలని అధికారులకు సూచించారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ పరిగి మండలం శ్రీ రంగరాజపల్లి గ్రామంలో రైతు ఆదినారాయణ రెడ్డి పొలంలో ఉపాధిహామీ కింద చేపట్టిన పండ్ల తోటల పెంపకాన్ని పరిశీలించారు. పండ్ల మొక్కలను బాగా కాపాడుకోవాలని, వాటి సంరక్షణ ఎంతో ముఖ్యమని రైతుకు జిల్లా కలెక్టర్ సూచించారు. పొలంలో ఎన్ని పండ్ల మొక్కలు నాటారు, ఒక మొక్కకు ఎంత మొత్తం ఖర్చు చేసి కొనుగోలు చేశారు తదితర వివరాలను రైతును అడిగి జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు. అనంతరం పరిగి మండలం శ్రీ రంగరాజపల్లి గ్రామంలో వినియగదారుడు వెంకటరమణకి చెందిన మినీ గోకులాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి :

పరిగి మండల కేంద్రంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిర్దేశించిన సమయంలోగా భవన నిర్మాణాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం పరిగి మండల కేంద్రంలోని సచివాలయం -2 ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. సచివాలయానికి వచ్చే సర్వీసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు అంతా ప్రతిరోజు హాజరు పట్టికలో పేర్లు నమోదు చేయాలన్నారు. గడువు తీరిన సమస్యలు ఏమి పెండింగ్ ఉంచకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పోస్టర్లను, పథకాలకు అర్హత సాధించిన లబ్ధిదారుల జాబితాను తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ నవీన్, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, తహసీల్దార్ సౌజన్య లక్ష్మీ, ఏపీడి శివానందనాయుడు, ఏపీఓ చంద్రశేఖర్, హార్టికల్చర్ ప్లాంటేషన్ సూపర్వైజర్ భాస్కర్, ఎంపిడిఓ రామారావు, పశుసంవర్ధక శాఖ డిడి సుబ్బారావు, ఎడి పెంచులయ్య, సచివాలయ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.



Comments