శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి): ఆషాడ మాసం సందర్భముగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రతి సంవత్సరము వలే ఈ ఏడాది కూడా తెలంగాణా రాష్ట్రం,  హైదరాబాద్ భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారు ఈరోజు అనగా  ది.18-07-2021, ఆదివారం  రోజున ఉదయం 10 గం.లకు శ్రీ అమ్మవారికి బంగారు భోణం సమర్పించుటకు విచ్చేయగా బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి వద్ద గౌరవనీయులైన దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ గారు మరియు గౌరవనీయులైన ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు మరియు పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు.

అనంతరం బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి నందలి దేవతామూర్తుల వద్ద శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ గారు,  గౌరవనీయులైన ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు, పాలకమండలి సభ్యులు మరియు తెలంగాణా బొణాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమమును ప్రారంభించారు. అనంతరం 

తెలంగాణా బొణాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు జమ్మిదొడ్డి నుంచి వివిధ కళాకారుల వేషధారణలు, కోలాటం మరియు సాంస్కృతిక కార్యక్రమాలుతో కోవిడ్ నిబంధనలను అనుసరించి ఊరేగింపుగా బయలుదేరి రధం సెంటరు, ఘాట్ రోడ్డు మీదుగా శ్రీ అమ్మవారికి సమర్పించు బంగారు భోణం తలపై ఉంచుకుని శ్రీ అమ్మవారి ఆలయమునకు కాలినడకన చేరుకోగా శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ గారు మరియు గౌరవ నీయులైన ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ బొణాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనము చేసుకొని, అమ్మవారికి భోణం సమర్పించి, ఆలయ ఆవరణలోని రావి చెట్టు వద్ద ఉన్న దేవతామూర్తులకు పూజలు నిర్వహించడము  జరిగినది. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు శ్రీ లింగంభొట్ల దుర్గాప్రసాద్ (ప్రధానార్చకులు)గారు, శ్రీ కనుగుల వెంకటరమణ (బాలా)గారు, శ్రీమతి నెలబట్ల అంబిక గారు, శ్రీమతి నేతికొప్పుల సుజాత గారు,  శ్రీమతి బండారు జ్యోతి గారు, శ్రీమతి కత్తిక రాజ్యలక్ష్మి గారు, శ్రీ నెరుసు సతీష్ గారు, శ్రీమతి కటకం శ్రీదేవి గారు, శ్రీమతి చక్కా వెంకట నాగ వరలక్ష్మి గారు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి వార్లు, పర్యవేక్షకులు మరియు అధికారులు పాల్గొన్నారు.