కాజ లో సచివాలయాలను పరిశీలించిన కలెక్టర్
గుంటూరు (ప్రజా అమరావతి);
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పధకాల అమలులో గ్రామ సచివాలయాల సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు.
కాజ గ్రామంలో 1, 2 సచివాలయాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సిబ్బందితో నేరుగా మాట్లాడారు.
డిజిటల్ అసిస్టెంట్ విధులుపై ఆరా తీశారు. వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు.
ఆన్ లైన్ ద్వారా వస్తున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారని అడిగారు. పంచాయితీ కార్యాలయంలోనే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం, ఇక్కడ అన్ని వసతులు స్రకమంగా ఉన్నాయా లేదా అని పరిశీలన చేశారు.
విధుల్లో సిబ్బంది సక్రమంగా పని చేయాలని సూచించారు.
అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
కాజ గ్రామ సచివాలయంలో సిబ్బంది అంతా విధుల్లో ఉండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా e_ జిల్లా మేనేజర్ రత్నం, పెదకాకాని మండల ఇన్ చార్జీ తహాశీల్దార్ దినేష్ రాఘవేంధ్ర, ఎంపిడివొ హనుమారెడ్డి, ఇన్ చార్జీ పంచాయితీ కార్యదర్శి రాజారామ్, తాడేపల్లి-మంగళగిరి కార్పోరేషన్ కమీషనర్ నిరంజన్ రెడ్డి, మంగళగిరి తహాశీల్ధార్ రామ్ ప్రసాద్, మంగళగిరి ఇన్ చార్జీ ఎమ్పీడివొ రమా ప్రసన్న, కాజ పంచాయితీ కార్యదర్శి రమేష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment