కోవిడ్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు'*
*'మాస్కు లేకపోతే వంద జరిమానా'*
*'కోవిడ్ నిభంధనలు అమలు పరచని వ్యాపార సముదాయాలపై రూ.10,000 నుంచి రూ.25,000 వరకూ జరిమానా'*
*'మార్కెట్ అసోషియేషన్లు కోవిడ్ నియమావళిపై అవగాహన కల్పించాలి'*
*:జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్*
కోవిడ్ నియమవాలిపై ప్రభుత్వం విడుదల చేసిన నూతన జీవో జిల్లాలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ అధికారులను ఆదేశిస్తూ ప్రకటన విడుదల చేశారు.
ముఖ్యంగా మాస్కు ధరించడంలో నిర్లక్ష్యాన్ని సహించొద్దన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని వారికి రూ.100 జరిమానా పక్కాగా అమలు చేయాలన్నారు. మాస్కు ధరించని వారిని షాపులు, కార్యాలయాల్లోకి అనుమతించొద్దన్నారు. మాస్కుల్లేని వారిని అనుమతించే కార్యాలయాలపై రూ.10,000 నుంచి రూ.25,000 వరకూ ఫైన్ విధిస్తామన్నారు. మరీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంస్థలు, కార్యాలయాలను ఒకటి నుంచి రెండు రోజులు మూసివేస్తామన్నారు.
మార్కెట్ అసోషియేషన్ల ద్వారా మార్కెట్ ప్రాంతాల్లో కోవిడ్ నియమావళి పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించని వారితో అమ్మకాలు చేపట్టకూడదన్నారు.
కోవిడ్ నియమావళి పాటించని సంస్థల గురించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజలు కూడా ఐదు మందికి మించి ఒక చోట గుమిగూడదన్నారు. అయితే ఈ నిబంధన భౌతిక దూరం పాటిస్తూ క్యూలో నిలబడి వస్తు,సేవల కొనుగోలు చేసేవారికి వర్తించదన్నారు.
addComments
Post a Comment