నష్ట నివారణ చర్యలు చేపట్టండి'
: *జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్*
అనంతపురము, జులై 18 (ప్రజా అమరావతి);
కదిరి రెవెన్యూ డివిజన్ లో శనివారం కురిసిన భారీ వర్ష భీభత్సం సందర్భంగా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం జిల్లా జలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ అధికార యంత్రాంగంతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ముందుగా లోతట్టు ప్రాంతాల్లో ఉండి నిలువ నీడ కోల్పయిన వారికి నీరు, ఆహారం, సంరక్షణ వంటి కనీస సౌకర్యాలను అందించాలని అధికారులను ఆదేశించారు. అంచనాలకు మించి ఆహార ప్యాకెట్లు, మంచి నీరు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
మండలాల వారీగా వర్షపాతం వివరాలు, అంచనా నష్టం వివరాలు అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు.
కదిరి డివిజన్ లో విపత్కర పరిస్థితుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టిన డీఎస్పీ భవ్య కిషోర్ ను జిల్లా కలెక్టర్ అభినందించారు.
ప్రజలకు అవసరమైన విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, ఆహార సరఫరా, రవాణా వంటి సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. పుట్టపర్తి, గోరంట్ల, కదిరి పట్టణం ఎన్ పి కుంట, ఆమడగూరు, నల్లచెరువు, గాండ్లపెంట,మండలాలు తాసిల్దార్ లతో పలు ఆదేశాలు జారీ చేశారు. పంట నష్టం, పండ్ల తోటలో నష్టము, వ్యవసాయ అధికారులు, మరియు ఉద్యాన శాఖ అధికారులు అంచనావేసి నివేదికలను కలెక్టర్ కార్యాలయానికి అందజేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వాగులు ,చెరువులు దగ్గర, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
నీటి పారుదల పెరిగిన కారణంగా దెబ్బతిన్న రోడ్ల ఇరు వైపులా సామాన్య జనాలకు అర్ధమయ్యే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కదిరి ఆర్డీవో వెంకట్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ వరకుమార్, ఆర్ అండ్ బీ అధికారులు, పంచాయితీ రాజ్ ఎస్ఈ భాగ్యరాజ్, తాసిల్దార్ లతో,ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment