రెడ్ క్రస్ సొసైటీ రాష్ట్రపతి పతకాన్నిఅందుకున్న శ్రీ వై.డి. రామారావును అభినందించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషన్ హరిచందన్

 రెడ్ క్రస్  సొసైటీ రాష్ట్రపతి పతకాన్నిఅందుకున్న  శ్రీ వై.డి. రామారావును అభినందించిన  ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషన్ హరిచందన్


           

విజయవాడ, జూలై 16 (ప్రజా అమరావతి):  ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు ఇండియన్ రెడ్‌ క్రస్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు శ్రీ బిస్వ భూషన్ హరిచందన్ 2018-19 సంవత్సరానికి  ఇండియన్ రెడ్‌ క్రస్ సొసైటీ రాష్ట్రపతి  బంగారు పతకాన్ని తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రస్  సొసైటీ చైర్మన్ శ్రీ వై. డి. రామారావుకు  శుక్రవారం రాజ్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో అందచేసారు. రెడ్ క్రస్  సొసైటీ ఉద్యమానికి దశాబ్దానికి పైగా చేసిన విశిష్ట సేవలు అందించినందుకుగాను శ్రీ రామారావు కు  జాతీయ స్థాయిలో ఈ ఘనత దక్కింది.  భారతీయ రెడ్‌ క్రస్ ఉద్యమం కోసం  అయన అందించిన విశిష్ట  సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి పతకం సాధించినందుకు శ్రీ రామారావును గవర్నర్ శ్రీ హరిచందన్ అభినందించారు. శ్రీ రామారావుకు దక్కిన గౌరవం  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ  బృందం అందరికి గర్వ కారణం అని చెప్పారు. 

ఇండియన్ రెడ్ క్రస్ సొసైటీ, నేషనల్ హెడ్ క్వార్టర్స్ ప్రతి సంవత్సరం రెండు బంగారు పతకాలను జాతీయ స్థాయిలో 15 ఏళ్ళకు పైగా విశిష్ట సేవలు అందించిన వారికీ రాష్ట్రపతి చేతుల మీదుగా అందిస్తారు.  శ్రీ వై.డి. రామారావును  2018-19 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేసారు. కోవిడ్ -19 పరిమితుల కారణంగా, రాష్ట్రపతి బంగారు పతకాన్ని శ్రీ వై.డి. రామారావు కు . ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చేతుల మీదుగా అందచేయడం జరిగింది. రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి శ్రీ ముఖేష్ కుమార్ మీనా, ఐఆర్‌సిఎస్ ఎపి రాష్ట్ర శాఖ చైర్మన్ శ్రీ ఎ. శ్రీధర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీ ఎ.కె. పరిడా  పాల్గొన్నారు.,


Comments