జూమ్ యాప్ లో కూర్చొని కార్పోరేషన్లను క్రియేట్ చేయడం కుదరదు

 


- జూమ్ యాప్ లో కూర్చొని కార్పోరేషన్లను క్రియేట్ చేయడం కుదరదు 


- చంద్రబాబు హయాంలో ఎందుకు క్రియేట్ చేయలేదు 

- 2024 లో పోటీ ఇవ్వలేదని చంద్రబాబుకు తెలుసు 

- ఒంటరిగా వెళ్లే ప్రతిపక్ష హెదా రాదని అర్ధమైంది 

- బీజేపీలో విలీనం చేయాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 



తాడేపల్లి, జూలై 18 (ప్రజా అమరావతి): జూమ్ యాప్ లో కూర్చొని కార్పోరేషన్లను క్రియేట్ చేయడం కుదరదని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు న్యాయం చేయాలంటే తాను కూడా నిబంధనలను పెట్టుకోవాలని సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయించుకున్నారన్నారు. వాటిని అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారని గుర్తుచేశారు. ఈ నిబంధనలను చంద్రబాబు పెట్టినట్టుగా, వాటిని జగన్మోహనరెడ్డి పట్టించుకోకుండా వెళ్తున్నట్టుగా, ప్రభుత్వాన్ని చంద్రబాబు కంట్రోల్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారన్నారు. చంద్రబాబుకు టైం అయిపోయిందని అన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, బడుగు, బలహీన వర్గాలు, అగ్రకులాల్లో ఉన్న పేదల కోసం సీఎం జగన్మోహనరెడ్డి తపిస్తున్నారన్నారు. ఎన్నడూ వినని వెనుకబడిన కులాలను కూడా కార్పోరేషన్లుగా ఏర్పాటు చేశారన్నారు. వాటన్నింటినీ సీఎం జగన్ సొంతంగా క్రియేట్ చేస్తున్నట్టుగా చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడన్నారు. కార్పోరేషన్లను ప్రభుత్వాలే ఏర్పాటు చేస్తాయని, జూమ్ యాప్  లో కూర్చొని క్రియేట్ చేయడం కుదరదన్నారు. అధికారంలోకి వస్తే 139 బీసీ కులాలకు కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తానని జగన్మోహనరెడ్డి ఎన్నికల్లో వాగ్దానం చేశారన్నారు. బీసీలకు సముచిత స్థానం కల్పిస్తానని, ఆయా కులాల సమస్యలను కార్పోరేషన్ల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని చెప్పారన్నారు. జగన్మోహనరెడ్డి క్రియేట్ చేశారని చెప్పే చంద్రబాబు తన హయాంలో కార్పోరేషన్లను ఎందుకు క్రియేట్ చేయలేదని ప్రశ్నించారు. అన్ని కులాలు, మతాలు, వర్గాలను సీఎం జగన్మోహనరెడ్డి సమాన దృష్టితో చూస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేష్ లు ఏమీ చేయలేక పనికిమాలిన వెధవల్లా రాష్ట్రంలో మిగిలిపోయారన్నారు. అందువల్లే ఏదో రకంగా జగన్ పై బురద జల్లి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేష్ ను ప్రజలు క్షమించరన్నారు. ఉన్నతమైన విలువలు, వ్యక్తిత్వం కల్గిన, స్వయంగా నిబంధనలను పెట్టుకుని వాటి ప్రకారం నడుస్తున్న జగన్మోహనరెడ్డికి రాష్ట్ర ప్రజల, దేవుని ఆశీస్సులు ఉంటాయన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. ఆయన బీజేపీతో మాట్లాడుకుంటున్న విషయం మాకు తెలుసని చెప్పారు. టీడీపీని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారని తెలిపారు. పనికిమాలిన పప్పు ఏమీ చేయలేడని, 2024 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పోటీ ఇవ్వలేదని చంద్రబాబుకు తెలిసిపోయిందన్నారు. బీజేపీ, జనసేనలు కూడా టీడీపీతో కలవరని కూడా చంద్రబాబుకు తెలుసన్నారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ప్రతిపక్ష హెూదా కూడా రాదని అర్ధమైపోయిందన్నారు. విలీనం జరిగితే రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ఒక అబద్దాల కోరు, దగాకోరు, నక్కజిత్తుల వ్యక్తి ఈ దెబ్బతో అన్నీ వదిలిపోతాయన్నారు. 70 ఏళ్ళ వయస్సు, 40 ఏళ్ళ సీనియార్టీ అని చెప్పుకునే చంద్రబాబు నిజంగా ఎక్కడైనా అన్యాయం జరిగితే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. కల్లబొల్లి కబుర్లు, దొంగ మాటలు, ఏదో రకంగా భ్రష్టు పట్టించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తే ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.

Comments