*విశాఖ ఉక్కు కోసం రాజీనామాలకు సిద్ధం: చంద్రబాబు
*
అమరావతి (ప్రజా అమరావతి): విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తెదేపా నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా రాజీనామాకు సిద్ధమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈమేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ నేతలకు శుక్రవారం చంద్రబాబు లేఖ రాశారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో 1960లో తెలుగు ప్రజలు విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి చంద్రబాబు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
‘‘ఎన్నో ఆటంకాలు దాటి 1992లో స్టీల్ ప్లాంట్‌ను దేశానికి అంకితం చేస్తే.. 2000 సంవత్సరంలో నాటి వాజ్‌పేయీ ప్రభుత్వం ఈ ప్లాంటును రూ.4వేల కోట్లకు ప్రైవేటీకరించేందుకు సిద్ధపడింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నేను వ్యక్తిగతంగా అభ్యర్థించడం, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో రూ.1,333 కోట్ల ప్యాకేజీ ఇచ్చింది. దీంతో విశాఖ ప్లాంట్ తిరిగి లాభాల బాట పట్టేలా చేశాం. విశాఖ ఉక్కు పరిరక్షణకు సీఎం జగన్ నేతృత్వం వహించాలి. ఉక్కు ఉద్యమాన్ని సీఎం జగన్ ముందుండి నడిపించాలి. ఐక్య పోరాటం వల్లే ఉక్కును ప్రైవేటీకరించకుండా కాపాడగలం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
addComments
Post a Comment