శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి): ఈరోజు అనగా ది.19-07-2021 న డోర్ నెం.41/1/2/39, ద్వారాకానగర్ 2వ లైను, కృష్ణలంక, విజయవాడకు చెందిన శ్రీ నాంగెడ్డ వీరసురేశ్ గారు మరియు కుటుంబ సభ్యులు శ్రీ అమ్మవారి ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము నిమిత్తం రూ.1,01,116/-లు ను శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారిని కలిసి దేవస్థానమునకు చెక్కు రూపములో విరాళముగా అందజేసినారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వారితో పాటు గౌరవ పాలకమండలి సభ్యురాలు శ్రీమతి ఎన్. సుజాత గారు పాల్గోన్నారు. ఆలయ అధికారులు దాతకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము శ్రీ అమ్మవారి ప్రసాదములు అందజేసినారు.
addComments
Post a Comment