శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి): 

ఆషాడ మాసం సందర్భంగా శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించుటకు గాను చీరలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, స్వీట్లు మరియు ఇతర వస్తువులతో బృందములుగా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ ఈరోజు వివిధ బృందముల వారు దేవస్థానం నకు విచ్చేయగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు.. 

     ఈ రోజు ఖమ్మం కు చెందిన శ్రీ కె.సత్య సుధాకర్ గారి బృందం, వి.నాగ ప్రసాద్ గారు, కోడూరు కు చెందిన శ్రీ ఎస్.శివ నాగమల్లేశ్వరి గారి బృందము, మంగళగిరి కి చెందిన శ్రీ పి. నర్సిరెడ్డి గారు బృందము, 

మల్లికార్జున పేట కు చెందిన శ్రీ కె.శ్రీనివాసరావు గారి బృందము, కామకోటి నగర్ కు చెందిన శ్రీ విజయలక్ష్మి గారి బృందం, కొత్తపేట కు చెందిన శ్రీ పి. బాలాత్రిపురసుందరి గారి బృందం, విజయవాడకు చెందిన శ్రీ దాక్షాయణి గారి బృందము, శ్రీ ఎన్.గోపాల్ గారి బృందము, శ్రీ టి. భవాని గారి బృందము, ప్రసాద్ గారి బృందము, శ్రీ టి.ఆదిలక్ష్మి గారి బృందము మరియు ఇతర బృందములకు చెందిన భక్తులు శ్రీ అమ్మవారికి భక్తితో సారె సమర్పించారు. 

   శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు పవిత్ర సారె సమర్పించే భక్తుల కొరకు దేవస్థానం నందు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.

శ్రీయుత కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు మరియు ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారి ఆదేశముల మేరకు ఆలయ అధికారులు 

శ్రీ అమ్మవారికి సారె సమర్పించిన భక్త బృందం వారికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం, భక్తులు మహామండపం 6 వ అంతస్తు నందు  ఏర్పాటు చేసిన శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తి వద్దకు చేరుకుని భక్తితో  శ్రీ అమ్మవారి నామస్మరణతో నామ పారాయణలు చేయగా,  సారె సమర్పించిన భక్తబృందం వారి కొరకు ఆలయ అర్చకులు పూజ నిర్వహించారు.

Comments