జగనన్న విద్యా దీవెన

 

అమరావతి (prajaamaravati);


*జగనన్న విద్యా దీవెన


*


*ఈ ఏడాది రెండో విడతగా దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు రూ. 693.81 కోట్లను క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*పినిపే విశ్వరూప్, సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి*


భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ గారు మనకిచ్చిన స్లోగన్‌ ఎడ్యుకేట్‌. ఆయన ఇచ్చిన స్లోగన్‌ గుర్తుచేసుకుంటూ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు ఆర్ధిక కారణాలతో ఏ ఒక్కరూ చదువు మధ్యలో ఆపకూడదు, చదువు లేని వారు ఉండకూడదని ఒక లక్ష్యంతో పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తూట్లు పొడిస్తే మీరు మాత్రం మళ్ళీ ఆయన తనయుడిగా పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ఇవ్వడమే కాక, పాత బకాయిలు కూడా విడుదల చేశారు. మీరు కులాలకు అతీతంగా విద్యార్ధులకు అందిస్తున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గారి ఆలోచనా తీరును ముందుకు తీసుకెళుతున్నారు. మీరు చేస్తున్న కృషి వల్ల గ్రామీణ విద్యార్ధులు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు, మీకు ధన్యవాదాలు సార్‌. 

 

*ఆదిమూలపు సురేష్, విద్యా శాఖా మంత్రి*


ఏపీలో విద్యా వ్యవస్ధలో ఇదొక నూతన అధ్యాయం. ఇది పెను విప్లవానికి నాంది పలుకుతూ అతిపెద్ద సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఉన్నత విద్య, మెరుగైన సమాజానికి మెట్టు అని రెండేళ్ళుగా సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ అక్షర యజ్ఞం చేస్తున్నారు. జగనన్న విద్యా దీవెన విద్యార్ధులకు ఇదొక వరం, గతంలో ఫీజులు అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగేది కానీ ఏ విద్యార్ధి కూడా ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ కోసం ఎదురుచూడకూడదు అని, తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం అప్పులు చేయకూడదన్నది మీ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం. గతంలో బకాయిలు కూడా మీరు పెద్ద మనసుతో చెల్లించడం, తర్వాత విడతల వారీగా చెల్లించడం...ఇదంతా చూస్తే పేదరికం చదువుకు అడ్డురాకూడదని మీ ముందుచూపు, ఆలోచన విద్యారంగానికి గొప్ప వరం. విద్య మీద పెట్టే ఖర్చు విద్యార్ధుల బంగారు భవిష్యత్‌కు ప్రభుత్వం పెట్టే పెట్టుబడి అన్న మీ ఆలోచన అక్షర సత్యం. మీ ఆశయాలను, ఆకాంక్షలను నిజం చేస్తూ విద్యార్ధులు ముందుకుసాగాలి. తల్లుల చల్లని దీవెనలు మీకు ఎప్పటికీ ఉంటాయి సార్‌. తెలంగాణ ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమాన్ని అమలుచేయాలనుకున్నప్పుడు, వారి విన్నపాన్ని మన్నిస్తూ వారు కూడా తెలుగు ప్రజలు, వారికి మనం సాయం చేయాలని, సాఫ్ట్‌వేర్‌తో పాటు అన్ని విధివిధానాలు ఇవ్వాలని తమరు తీసుకున్న నిర్ణయం గొప్పది. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఏపీలో జరుగుతున్న సంస్కరణల గురించి డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా మేం ఏపికి వచ్చి అన్నీ చూస్తామన్నారు, అంతేకాక ఈ మధ్యనే కస్తూరి రంగన్‌ గారు ఏపీ ప్రభుత్వం గురించి, మీ నాయకత్వం గురించి చాలా చక్కగా చెప్పారు. మీ ఆలోచనా విధానం వల్ల లక్షలాది మంది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు లబ్దిపొందుతున్నారు. వారి నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌నే నేను ఈ సందర్భంగా ప్రస్తావించాను సార్‌. ధ్యాంక్యూ.


*చిప్పాడ లావణ్యకుమారి, విద్యార్ధి తల్లి, విజయనగరం*


జగనన్నా మా పాప బీఎస్సీ సెకండియర్‌ చదువుతుంది, మా పిల్లలు ఇద్దరూ ఇంగ్లీష్‌ మీడియం చదువుతున్నారు, వారు ఇంగ్లీష్‌ మీడియంలో చదవడం వల్ల మంచి ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఉంది. మా పిల్లలకు అన్నీ అందుతున్నాయి, మా పిల్లల భాద్యత మీరే తీసుకుని చదివిస్తున్నారు. మాకు సొంతింటి కల కూడా మీ వల్లే నెరవేరింది, మా అత్తయ్య గారికి వృద్దాప్య ఫించన్‌ వస్తుంది. కోవిడ్‌ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ మీరు చేసిన సాయం వల్ల మాకు ఇబ్బంది లేకుండా జరిగింది. మీరు చేస్తున్న సేవలకు జీవితకాలం రుణపడి ఉంటాను. మా పిల్లల చదువుకు మీరు ఎంతో కృషిచేస్తున్నారు. మా జీవితాలలో మరిన్ని వెలుగులు నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నా, ధన్యవాదాలు


*తేజ ప్రకాష్, బీఎస్‌సీ మూడో సంవత్సరం విధ్యార్ధి, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా*


అన్నా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు విద్యార్ధుల కోసం స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌లు ఇచ్చి పేద, మద్యతరగతి కుటుంబాలలో వెలుగులు నింపారు. అలాగే తండ్రి ఆశయాలతో ఆయన తనయుడిగా మీరు విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలు ప్రవేశపెట్టారు, వీటి వల్ల నాలాంటి విద్యార్ధులు ఎందరో చదువుకుంటున్నారు. నేను బీఎస్‌సీ మూడో సంవత్సరం చదువుతున్నాను, నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని, మా నాన్న ఎరువుల వ్యాపారం చేస్తారు, నా చదువుకి అయ్యే ఖర్చు గురించి మా నాన్న శ్రమ పడకుండా మీరు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా చదువుకున్నాను. నేను ఈ రోజు నాలుగు ఉద్యోగాలు సంపాదించాను, ఇన్ఫోసిస్, విప్రో, అరబిందో, హెటిరో లో ఉద్యోగాలు వచ్చాయి, కానీ నేను ఇన్ఫోసిన్‌ ఎంచుకున్నాను. మీరు ఇంగ్లీష్‌ ను ప్రాధమిక స్ధాయిలో ప్రవేశపెట్టడం వల్ల ఇంటర్వ్యూలు ఎలా ఎదుర్కోవాలో ఉపయోగపడుతుంది. కమ్యూనికేషన్‌ స్కిల్‌ ఎంత ఉపయోగం అనేది నాకు తెలుసు, మీరు విద్యార్ధుల కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్, ఇంటర్న్‌షిప్‌ ప్రవేశపెట్టడం ద్వారా ప్రతీ విద్యార్ధి కూడా ప్రాక్టికల్‌ నాలెడ్జి సంపాదించి బయటికి వస్తారు, వారికి ఉద్యోగాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. విద్యార్ధుల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్‌.


*రామ లాలిత్య, విద్యార్ధిని, అనంతపురం*


జగనన్నా నేను బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్నాను, నాకు ఒక అక్క ఉంది, నా బాగోగులు, మంచి చెడ్డలు చూసుకోవడానికి ఒక అన్నయ్య ఉంటే బావుండేది అని అనుకున్నా లేరన్న భాద ఉండేది. కానీ విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలతో నాలాంటి ఎంతోమంది చెల్లెల్లకు, తమ్ముళ్ళకు ఒక అన్నగా మీరు భరోసానిస్తున్నారు. నిజంగా మీరు మాకు దేవుడిచ్చిన అన్నయ్యగా భావిస్తున్నాం.  చదువుకోవాలన్న పట్టుదల ఉండి డబ్బుల్లేక వాళ్ళ ఆశలు వారే నాశనం చేసుకుంటున్న టైంలో మీరు ఇలాంటి పథకాలు పెట్టి వారి జీవితాలలో వెలుగులు నింపుతున్నారు. గతంలో ఎక్కడికి వెళ్ళినా మీ నాన్న పేరు ఏంటనే వారు, ఆయన ఫోన్‌ నెంబర్‌ అడిగేవారు, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మ పేరు ఏంటని అడుగుతున్నారు, నిజంగా ఆడవాళ్ళకి చాలా ప్రాధాన్యత కల్పించారు, అమ్మ ఒడి కానీ ఏదైనా సరే డైరెక్ట్‌గా అమ్మల అకౌంట్లలో పడుతుంటే చాలా సంతోషంగా ఉంది. మేమే డబ్బులు కడుతుంటే నా కోసం మా జగనన్న పంపుతున్నారన్న సంతోషం మాకు కలుగుతుంది. ఏపీలో ఉన్న ప్రతీ విద్యార్ధి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను. కోవిడ్‌ టైంలో చాలామంది కళాకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, నేను క్లాసికల్‌ డాన్సర్‌ను, మీరు వారికి కూడా సహాయం చేస్తున్నారని విన్నాను, చాలా సంతోషంగా ఉంది. నా అన్నయ్యతో మాట్లాడే అవకాశం కలిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది, ధ్యాంక్యూ అన్నయ్యా.


*మహిచందన, విద్యార్ధిని, అనంతపురం*


సార్, విద్యారంగంలో మీరు చేస్తున్న అభివృద్ది అమోఘం, నేను ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో చదువుతున్నాను, అక్కడ ఎంతోమంది విద్యార్ధులకు ఉన్నత చదువులు చదవాలని ఎంతో కోరికగా ఉంటుంది కానీ వారికి అర్ధిక సమస్యల కారణంగా ఉన్నత చదువులకు దూరం అవుతున్నారు. మీరు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా వారంతా మంచి చదువులు చదువుతున్నారు. నాడు నేడు ద్వారా విద్యాసంస్ధల రూపురేఖలు మారిపోతున్నాయి, గతంలో ఎన్నడూ చూడలేదు. ఈ స్ధాయిలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా విద్యార్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మీకు చాలా ధన్యవాదాలు సార్, దిశ యాప్‌ మహిళలకు, బాలికలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మీరు ప్రవేశపెడుతున్న పథకాల ద్వారా అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ది చెందుతుంది. కోవిడ్‌ సమయంలో కూడా మీరు చాలా సమర్ధవంతంగా కట్టడి చేశారు, వ్యాక్సినేషన్‌ కూడా రికార్డు స్ధాయిలో చేసి ఎంతో ఘనత సాధించారు. ఈ ప్రభుత్వం చేస్తున్న కృషికి ముఖ్యమంత్రిగా మీకు విద్యార్ధుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్‌.


*పి. అంజనాదేవి, విద్యార్ధి తల్లి, గుంటూరు*


జగనన్నా మాకు ఇద్దరమ్మాయిలు, నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నా అన్నా, మా పిల్లలను చదివించడానికి, పెంచిపోషించడానికి చాలా ఇబ్బందులు పడ్డాను, అవమానాలు ఎదుర్కొన్నాను. ఎన్ని కష్టాలు ఉన్నా పిల్లలకు మంచి చదువులు చెప్పించాలనుకున్నా, ఆస్ధులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి, కానీ చదువులయితే ఎక్కడ ఉన్నా బాగా బతకగలరు, నా చిన్న కూతురు ఇంజనీరింగ్‌ మూడో ఏడాది చదువుతుంది, గతంలో ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ కింద రూ. 35 వేలు వచ్చేవి, మిగిలినవి కట్టడానికి చాలా ఇబ్బంది పడేదానిని. మీరు సీఎం అయిన తర్వాత ఫుల్‌ ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు, పైగా తల్లుల ఖాతాలో వేయడం చాలా సంతోషం. మేం నేరుగా కాలేజీలకు వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకుంటున్నాం, వసతి దీవెన పధకం ద్వారా పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వారికి కావాల్సిన పుస్తకాలు వారే కొనుక్కుంటున్నారు. పిల్లలు వారి మేనమామ వాళ్ళకి గిఫ్ట్‌ ఇచ్చినట్లుగా ఫీల్‌ అవుతున్నారు. సచివాలయాలలో అన్ని పథకాలు అందుతున్నాయి, నాకు, మా అమ్మకు ఇంటి స్ధలాలు మంజూరయ్యాయి, మా అమ్మకు ఫించన్‌ వస్తుంది. మీరు సీఎంగా వచ్చిన తర్వాత అభివృద్ది, సంక్షేమం చక్కగా చేస్తున్నారు. ప్రజలందరి తరపున మీకు ధన్యవాదాలు అన్నా, మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను


*సుమిత్ర, బీటెక్‌ విద్యార్ధిని, గుంటూరు*


మామయ్యా, మీరు ప్రవేశపెట్టిన విద్యాదీవెన, వసతి దీవెన పధకాలు విద్యార్ధులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి, గతంలో మాకు ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ కింద కేవలం రూ. 35 వేలు మాత్రమే ఇచ్చేవారు కానీ మీరు మాత్రం మొత్తం ఫీజు ఇవ్వడమే కాక తల్లుల ఖాతాలో వేయడం ద్వారా చాలా సహాయం చేస్తున్నారు. ఇది చాలా గొప్ప పథకం, అంతేకాక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా కరిక్యులమ్‌కు అదనంగా లేటెస్ట్‌ స్కిల్స్‌ నేర్పుతున్నారు. మీరు విద్యార్ధి లోకానికి చాలా గొప్ప సహాయం చేస్తున్నారు. మీరే మరింత కాలం మాకు ముఖ్యమంత్రిగా ఉండాలి, ధ్యాంక్యూ సోమచ్‌ మామయ్యా...

Comments