శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి): ఈ రోజు తేది. 19 -07 -2021 న మహామండపము 6 వ ఫ్లోర్ నందు హుండీ కౌంటింగ్ జరుగు ప్రదేశం, మరియు కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన వస్తు, సామాగ్రి అంతయూ మొదట fogging మెషిన్ ద్వారా శానిటైజ్ చేయించడము జరిగినది. అనంతరం హుండీ ల నుండి సేకరించిన నోట్లు మరియు కాయిన్లు కూడా fogging మెషిన్ ద్వారా శానిటైజ్ చేసిన అనంతరం వేరు చేసి, ఆలయ సిబ్బంది మాస్కులు ధరించి, సామాజిక దూరం మరియు ఇతర కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ హుండీ లెక్కింపు కార్యక్రమము నిర్వహించడం జరిగినది. హుండీ లెక్కింపు కార్యక్రమమును గౌరవనీయులైన ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ గారు, దేవాదాయ శాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది మరియు SPF సిబ్బంది పర్యవేక్షించారు.
ఈ రోజు హుండీ లెక్కింపు రిపోర్టు :-
లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ. 1,73,02, 857/- లు.
హుండీల ద్వారా వచ్చిన బంగారం: 415.3 గ్రాములు,
హుండీల ద్వారా వచ్చిన వెండి: 6 కేజీల 135 గ్రాములు
లెక్కించిన హుండీ లు : 38
గడచిన రోజులు : 19
భక్తులు కానుకల రూపంలో శ్రీ అమ్మవారికి సమర్పించారు.
మరియు రాష్ట్ర దేవాదాయశాఖ వారి website www.tms.ap. gov. in ద్వారా ది.30-06 -2021 నుండి ది.18-07-2021 వరకు online నందు e- హుండీ ద్వారా రూ.1,47,551/- లు భక్తులు శ్రీ అమ్మవారి దేవస్థానం నకు చెల్లించియున్నారు.
addComments
Post a Comment