రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఉద్యోగావకాశాలు.

 



అమరావతి (ప్రజా అమరావతి);

ఆగస్ట్ 15వ తేదీన డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ లాంచ్ : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

ఇకపై ప్రతి జిల్లాలో నెలకు 2 సార్లు మెగా జాబ్ మేళా :  మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

వైఎస్ఆర్ కడప జిల్లా నుంచే ప్రారంభానికి మంత్రి ఆదేశం.

రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఉద్యోగావకాశాలు.


స్కిల్ కాలేజీల పనుల పురోగతి, నిధుల సమీకరణలో వేగానికి చర్యలు.

బ్యాంకులతో సంప్రదించి నిధులు తెచ్చుకునే మార్గాలపై అన్వేషణ.

స్కిలింగ్ కోర్సులు, ట్రైనింగ్, ప్రమోషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి వెల్లడి.

ఆగస్ట్ 15వ తేదీన డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ లాంచ్ చేయాలని డైరెక్టర్ లావణ్యవేణిని ఆదేశించిన మంత్రి గౌతమ్ రెడ్డి.

స్కిల్ డెవలప్ మెంట్ తో ఎంప్లాయ్ మెంట్, ట్రైనింగ్ ని అనుసంధానం  చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశం.

ఎంప్లాయ్  మెంట్, ట్రైనింగ్ ప్రాధాన్యత పెంచే దిశగా చర్యల

అరుంధతి సాఫ్ట్వేర్ సహకారంతో వేగంగా నమోదు ప్రక్రియ

స్కిల్ కాలేజీలను ప్రభుత్వం నిర్దేశించిన రూ.20 కోట్ల బడ్జెట్ లో అత్యాధునికంగా తీర్చిదిద్దే డిజైనింగ్ లు కూడా పూర్తయ్యాయని మంత్రికి వివరించిన ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు.

నెల్లూరు జిల్లాలోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వెంకటగిరి, కర్నూలు జిల్లా డోన్ స్కిల్ కాలేజీల భూ సేకరణ పనుల పురోగతిపై ఆరా తీసిన మంత్రి గౌతమ్ రెడ్డి.అత్యాధునిక కోర్సుల ద్వారా శిక్షణ అందిస్తే ఉద్యోగాల కల్పన సులభమవుతందని మంత్రి వెల్లడి. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న స్కిల్ కాలేజీ భూసేకరణ పనిని త్వరగా పూర్తి చేయాలి.తూర్పుగోదావరి జిల్లా అమలాపురం స్కిల్ కాలేజీపై కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించి కొలిక్కి తీసుకువస్తామని మంత్రి మేకపాటికి వెల్లడించిన ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి.విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన సమీక్షకి హాజరైన నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఉపాధి కల్పన, శిక్షణ డైరెక్టర్ లావణ్య వేణి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు, నైపుణ్య శాఖ  సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎఫ్ సీ సీఎఫ్ఓ వేణుగోపాల్ తదితరులు.



Comments