పాముల పాడు (మం)వేంపెంట గ్రామంలోని బావినీటి నమూనాలను పరీక్షలు చేయించాం.

 


పాముల పాడు (మం)వేంపెంట గ్రామంలోని  బావినీటి నమూనాలను పరీక్షలు చేయించాం.


గ్రామంలో కొనసాగుతున్న వైద్య శిబిరం, సేవలందిస్తున్న వైద్య సిబ్బంది.


వర్షాకాలం అయినందున ప్రజలకు అవగాహన కల్పించాలి   


జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్ 


కర్నూలు, జులై 18 (ప్రజా అమరావతి);


పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో  బావి నీటి నమూనాలను పరీక్ష చేయించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు.  ఆర్డబ్ల్యూఎస్  అధికారులు, ల్యాబ్ టీం  ల ద్వారా బావి నీటి నమూనాలను సేకరించి  పరీక్షలు చేయించామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. క్లోరిన్ శాతాన్ని తెలిపే క్లోరోస్కోప్, బ్యాక్టీరియా కాలుష్యానికి సంబంధించిన H2S vial  పరీక్షలు కూడా చేయడం జరిగిందన్నారు..  పరీక్షల్లో  క్లోరిన్ శాతం 0.05 ppm ( Parts per million) ఉండగా , బ్యాక్టీరియా కాలుష్యం ఏమీ లేనట్లు  ల్యాబ్ రిపోర్టులో వచ్చిందన్నారు. చుట్టుపక్కల పైప్ లైన్లు కూడా పరిశీలించడం జరిగిందని,

ఎక్కడ కూడా పైప్ లైన్ దెబ్బతిని నీరు కలుషితం కాలేదన్నారు.


అయినప్పటికీ, ఇక ముందు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలు  ఓపెన్ బావిలోని నీటిని వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆదేశించడం ఆదేశించామన్నారు.


 అలాగే  క్లోరినేషన్ సక్రమంగా జరిగేలా  చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. వర్షాకాలం అయినందున సిబ్బంది అప్రమత్తంగా ఉందాలన్నారు . వేడి చేసి చల్లార్చిన  నీటిని తాగే లా టాంటాం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నీటి పైప్ లైన్లు  OHSR లను క్రమం తప్పకుండా  క్లోరినేషన్ చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించామని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) తెలిపారు..


పాముల పాడు (మం) వేంపెంటలో డాక్టర్లు, ఏఎన్ఎం ల పర్యవేక్షణలో మెడికల్ క్యాంప్ కొనసాగుతోందన్నారు. ఆదివారం డయేరియా కేసులు లేవన్నారు. 


 


Comments