మంగళగిరి (ప్రజా అమరావతి);
*కరోనాపై డప్పు కళాకారుడు వినూత్న ప్రచారం
.*
కరోనాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వ్యవహరించాలంటూ ఓ డప్పు కళాకారుడు వినూత్న ప్రచారం చేస్తోన్నాడు.
పొట్టకూటి కోసం ములక్కాయలు విక్రయిస్తూనే మరో పక్క సైకిల్ పై కరోనా వైరస్ జాగ్రత్తలను తెలిపే బోర్డును ఏర్పాటు చేసుకొని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు.
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత కొంత కాలం లాక్‌డౌన్ను ప్రకటించాయి. కరోనా పట్ల ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు అధికార యంత్రాంగమంతా నేటికీ విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి పెనుమాక గ్రామానికి చెందిన మైకెల్ అనే ఓ డప్పు కళాకారుడు పొట్టకూటి కోసం ములగకాయలు విక్రయిస్తూ... మరో పక్క ప్రజలు కరోనా భారిన పడకూడదంటూ వినూత్న ప్రచారం చేస్తోన్నాడు.
సైకిల్ పై కరోనా వైరస్ గురించి తెలిపేబోర్డును ఏర్పాటు చేసుకొని వీధి వీధినా తిరుగుతున్నాడు. తన వద్ద ములక్కాయలు కొనేందుకు వచ్చే వారికి కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తోన్నాడు. సామాజిక దూరం పాటిద్దాం... నోటికి మాస్కులు దరిద్దాం... శానిటైజర్ వాడదాం... షేక్ హ్యాండ్ వద్దు-నమస్కారం ముద్దు అని ప్రజలకు వివరిస్తోన్నాడు.
addComments
Post a Comment