06-08-2021
విజయవాడ(ప్రజా అమరావతి);
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతాం..
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు..
పర్యాటకులను ఆకర్షించే విధంగా అనేక ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి
చేస్తున్నామని, రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ను టూరిజం హబ్ అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ
లక్ష్యమని రాష్ట్ర పర్యాటక క్రీడల శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.
విజయవాడ బెర్మ్ పార్క్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపి టూరిజం కార్పోరేషన్
చైర్మన్ గా డా. ఆరిమండ వరప్రసాద్ రెడ్డితో మంత్రి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా
మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హోటళ్లు,
రిస్సార్ట్లు, బోటింగ్, కాన్ఫరెన్స్ హాల్స్ మరెన్నో ఆకర్షణీయమైన టూరిజం ప్యాకేజీలను పర్యాటకులకు
అందిస్తున్నామని మంత్రి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి దేశంలోనే ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఆశయాలకు అనుగుణంగా
పర్యాటకశాఖ పనిచేస్తున్నదని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ రాష్ట్రంలోని 13
ప్రాంతాలలో పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేసి 52 పడవలతో బోటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని
మంత్రి అన్నారు. డి వద్ద రెండు హౌస్ బోట్లు, బొర్రాగుహలు, బెలం గుహలు, ఎత్తిపోతల, చంద్రగిరి
ప్రాంతాలలో 5 ప్రదేశాలలో సౌండ్ అండ్ లైట్ కార్యకలాపాలను సంస్థ నిర్వహిస్తున్నదని శ్రీశైలంలో రోప్
వేను అభివృద్ధి చేశామని మంత్రి అన్నారు. రానున్న కాలంలో పర్యాటకరంగాన్ని మరింత అభివృద్ధి
చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన డా.
ఆరిమండల వర ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రజలకు
మరింత ఆహ్లాదకరమైన పరిస్థితులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సంస్థ 32 టూర్
ప్యాకేజీలను నిర్వహిస్తూ టెంపుల్ టూరిజంను కూడా ప్రోత్సహిస్తున్నదని ఆయన అన్నారు. పర్యాటకరంగ
అభివృద్ధికి నాపై నమ్మకంతో ఛైర్మన్ గా పదవినిచ్చి ప్రోత్సహించిన ముఖ్యమంత్రి వై.యస్.
జగన్మోహన రెడ్డికి కృతజ్ఞత తెలియజేస్తున్నానని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయుటలో ముఖ్యమంత్రి
ఆశయసాధనలో నేనుకూడా భాగస్వామిని అయినందుకు ఎంతో ఆనందంగా ఉందని శ్రీ వరప్రసాద రెడ్డి
అన్నారు.
ఈసమావేశంలో రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి
వెలంపల్లి శ్రీనివాసరావు,గృహనిర్మాణ శాఖ మంత్రి వర్యులు చేరుకువాడ రంగనాధ్,
పర్యటక శాఖ ప్రభుత్వ ప్రేత్యేక ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ్ , ఏపిటిడిసి ఎండి , ఎపిటియే సీఈవో సత్యనారాయణ ,
తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి, రాష్ట్ర ఫైబర్ నెట్ కార్పోరేషన్ ఛైర్మన్
పి. గౌతంరెడ్డి, మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, పాఠశాల విద్యానియంత్రణ మరియు పర్యవేక్షణ
కమిషన్ వైస్చర్ పర్సన్ డా. విజయశారదా రెడ్డి, శాసనసభ్యులు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, కిలారి
రోశయ్య, అన్నా బత్తిన శివకుమార్, శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్సీలు
జంగా కృష్ణమూర్తి, కల్పా
లత రెడ్డి,
విజయవాడ సిటీ నాయకులు
బొప్పన భవకుమార్, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ,
విజయవాడ నగరపాలక
డిప్యూటి మేయరు శైలజారెడ్డి,
గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఏపీ పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చిరంజీవి రెడ్డి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకరావు , రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ రావు, రెడ్డికార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి, ఎంఎస్ ఎంఈ చైర్మన్ వంక రవీంద్రనాద్ద్ , పర్యావరణ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బ చంద్రశేఖర్ , గ్రంధాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరి రావు, ఏపీ యస్ ఈ ఆర్ ఎంసీ సీఈవో ఆలూరి సంబశివరెడ్డి, ఎఫ్ యస్ ఎం ఈ నేషనల్ ప్రెసిడెంట్ ఎపి కె రెడ్డి ,
ఏపీ స్కిల్
devalopment advisior చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీపీఈఈ సీఎంఏ చైర్మన్ సి.గంగిరెడ్డి,
తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment