పాఠశాలల ఆధునికీకరణలో పెను విప్లవం-మన బడి నాడు నేడు

 పాఠశాలల ఆధునికీకరణలో పెను విప్లవం-మన బడి నాడు నేడు


పాఠశాలను ఒక పవిత్ర దేవాలయంగా భావించి అందులో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని అకుంటిత దీక్షతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా స్కూల్స్ లో పరీక్షా ఫలితాలను మెరుగుపరచడం, బడి బయట విద్యార్థుల సంఖ్యను తగ్గించి వారిని స్కూల్స్ లో చేర్పించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. 

ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాల వల్ల ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 4 లక్షల వరకు అడ్మిషన్లు పెరిగాయి.


గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా మొదటి దశలో పూర్తి అయిన పనులను ఆగస్టు 16, 2021 న రాష్ట్ర విద్యార్థులకు అంకితం ఇస్తారు. అక్కడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రెండవ దశ పనులను లాంఛనంగా ప్రారంభిస్తారు. మూడవ దశ  పనులను ఆగస్టు 2022 లో ప్రారంభిస్తారు.


 'మన బడి నాడు- నేడు'  పథకాన్ని నవంబరు 14, 2019 లో ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా రూ.16,700 కోట్లు ఖర్చుతో మూడు దశలలో పాఠశాలల ఆధునికీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా నిర్వహించే పనులు పూర్తి పారదర్శకతతో, నిబద్ధతతో, నాణ్యతతో పాఠశాలల తల్లిదండ్రుల కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 

మూడు సంవత్సరాల పాటు దశల వారీగా దాదాపు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 3,287 ప్రభుత్వ హాస్టళ్ల ఆధునికీకరణ తో పాటు దీనికి తోడు మరో 27,438 అంగన్ వాడీలకు కొత్త భవనాలు నిర్మించనున్నారు.

 'మన బడి నాడు- నేడు' పథకం కింద పది అంశాలతో కూడిన మౌలిక వసతుల కల్పన చేపట్టడం జరుగుతుంది.(1)నిరంతర నీటి వసతితో మరుగుదొడ్లు(2)రక్షిత త్రాగునీరు సరఫరా(3)పాఠశాలకు అవసరమైన మరమ్మతులు చేయడం(4)ప్రతి గదికి ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు (5) విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఫర్నిచర్ (6) గ్రీన్ చాక్ బోర్డు(7) పెయింటింగ్(8)ఇంగ్లీష్ ల్యాబ్(9) ప్రహరీ గోడ (10) వంట గది నిర్మాణం.

మూడేళ్ల అనంతరం.. 

నాడు- నేడు కార్యక్రమం అమలుకు ముందు ఉన్న స్థితి అమలు తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన అభివృద్ధిని ఫోటోలతో సహా పోల్చి చూపడం ఈ కార్యక్రమం రూపకల్పన వెనుక ఉన్న సంకల్పం... 

మొదటి దశలో 15,715 పాఠశాలలను పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఎపి సమాగ్ర శిక్షా, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ, మునిసిపల్ & పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాలు, కొన్ని జిల్లాల్లో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మరియు ఆర్డబ్ల్యుఎస్ అమలు చేసే ఏజెన్సీల ద్వారా అమలు జరుగుతున్నాయి. 

‘మన బడి: నాడు- నేడు' ప్రధానాంశాలు

అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక వసతులు మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం.  మూడేళ్ల వ్యవధిలో పనులు పూర్తి చేయడానికి 2020-21 నుంచి ప్రతి ఏడాది 1/3 వ వంతు పనులు చేపట్టి పాఠశాలలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. కమ్యూనిటీ కాంట్రాక్టింగ్-పేరెంట్ కమిటీ (పిసి) యాజమాన్యాల ద్వారా సాధికారత మరియు నాణ్యతపై శ్రద్ధ మరియు ఖర్చు తగ్గించడం జరగుతుంది. అత్యంత నాణ్యత ప్రమాణాలతో కూడిన మెటిరీయల్ (సామగ్రి) మరియు నిర్వహణ ప్రక్రియలు ద్వారా పనులు చేపట్టడం జరుగుతోంది.

రాష్ట్ర స్థాయిలో సామగ్రి కొనుగోలు దేశంలోనే మొదటిసారి

• ప్రతి పాఠశాల ఒకే ప్రామాణికత కలిగి ఒకేలా ఉండేలా చేయడం.

• సామగ్రి తయారీదారుల దగ్గరే తీసుకోవడం (OEM)

• పరిశోధన మరియు అభివృద్ధి ఆధారంగా అధిక గ్రేడ్ లక్షణాలు ఉన్న వస్తువుల సేకరణ

మొదటి దశలో వ్యయం:

తీసుకున్న పాఠశాలలు మొత్తం: 15,715 అంచనా మొత్తం: రూ. 3,996 కోట్లు. 

2020-21 సంవత్సరానికి మొదటి దశ కోసం బడ్జెట్ కేటాయింపు : రూ.3,669 కోట్లు.

రాష్ట్ర స్థాయిలో సామగ్రి కొనుగోలు: 

నాణ్యతను పెంచడానికి మరియు ఒకేవిధమైన ప్రమాణాలను నిర్వహించడానికి అవసరమైన కొన్ని వస్తువులు గుర్తించబడ్డాయి. వాటికోసం రాష్ట్ర స్థాయిలో టెండర్లు పిలవబడ్డాయి. సరఫరాదారులను రాష్ట్ర స్థాయి టెండర్ కమిటీ నిర్ణయించింది. ఈ టెండర్ యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే అసలు సామగ్రి తయారీదారులు/ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు (OEMలు) మాత్రమే టెండర్లలో పాల్గొనడానికి అర్హులు. 

II & III విడతల్లో పాఠశాలలతో పాటు సంక్షేమ హాస్టళ్లు: 

పాఠశాలలతో పాటు, ‘నాడు- నేడు' కింద రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఇంగ్లీఘ మీడియం లో విద్యా బోధన:

పేదల పిల్లలకు కూడా ఇంగ్లీషు విద్య అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధన కు చర్యలు తీసుకోవడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేద విద్యార్ధులు రాణించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీఘ మీడియం లో విద్యా బోధన... విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయటం జరుగుతుంది. ఆంగ్లభాషా నైపుణ్యాలను పెంపొందించేలా ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు ల్యాబ్ ల ఏర్పాటు చేయడం జరుగుతుంది.


జగనన్న విద్యా కానుక: ప్రతి సంవత్సరం పాఠశాలలు ప్రారంభమైన వెంటనే విద్యార్ధులకు యూనిఫారాలు, స్కూల్ బ్యాగ్, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్,వర్క్ బుక్స్,బెల్ట్, సాక్స్,  బూట్ల  తో పాటు ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ అందిస్తున్న ప్రభుత్వం. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా బడి పిల్లలకు ఇన్ని వస్తువులతో కూడిన స్టూడెంట్ కిట్లు ఇస్తున్న మొట్టమొదటి, ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.