జిల్లాలో జగనన్న విద్యా కానుక పథకం

   నెల్లూరు, జూలై 4 (ప్రజా అమరావతి):--

  జిల్లాలో జగనన్న విద్యా కానుక పథకం


ద్వారా పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, బూట్లు, నోట్ పుస్తకాలు, టైలు, బెల్టులు, యూనిఫామ్ తదితర సామాగ్రిని ఈనెల 16 తేదిలోగా విద్యార్థులకు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆయన "జగనన్న విద్యా కానుక పథకం " పురోగతిపై విద్యాశాఖ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈనెల 16న పాఠశాలలు ప్రారంభమవుతున్న దృష్ట్యా అధికారులు వేగంగా జగనన్న విద్యా కానుక కిట్ ను ప్రతి విద్యార్థికి అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే పాఠశాల భవన నిర్మాణ పనులు కూడా త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా 100 శాతం చేయించాలన్నారు. మండల విద్యాశాఖ అధికారులు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ వేయించాలన్నారు. పాఠశాలలో, హాస్టళ్లలో పనిచేసే సిబ్బందికి కూడా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలన్నారు. 

  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీ గణేష్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ రమేష్, సీఎంవో శ్రీనివాసులు, అసిస్టెంట్ ఏఎం ఖాజా మొహిదీన్, టెస్ట్ బుక్ మేనేజర్ విజయ్ కుమార్, ఏఎస్ఓ రత్నం బాబు పాల్గొన్నారు.


Comments