*రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష*
*క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి*
*వైయస్సార్ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, ఎంఐజీ లే అవుట్లు, 90 రోజుల్లో ఇళ్లపట్టాల కార్యక్రమాలపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
అమరావతి (ప్రజా అమరావతి);
పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో ప్రగతిని వివరించిన అధికారులు
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణపనులు, ఇతరత్రా అంశాలపై సీఎం ఆదేశించిన విధంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామని తెలిపిన అధికారులు
వారినుంచి ఫీడ్ బ్యాక్‌ను తీసుకున్నామన్న అధికారులు
నిర్మించనున్న ఇళ్ల మ్యాపింగ్, రిజిస్ట్రేషన్, జాబ్‌కార్డుల జారీ, జియో ట్యాగింగ్ దాదాపుగా పూర్తయ్యిందని తెలిపిన అధికారులు
శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా సంబంధిత కాలనీల్లో 80 శాతానికిపైగాకి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని వెల్లడి
ఇళ్ల నిర్మాణ సామగ్రి కోసం రివర్స్‌టెండరింగ్ ద్వారా రూ. 5,120 కోట్లు ఆదాచేశామన్న అధికారులు
ఒక్కో ఇంటి నిర్మాణ సామగ్రి కొనుగోలులో దాదాపుగా రూ.32వేల రూపాయలు ఆదా అయ్యిందన్న అధికారులు
లబ్దిదారుల కోరిక మేరకు వారికీ నిర్మాణ సామగ్రిని పంపిణీ చేస్తున్నామన్న అధికారులు
దీనికోసం ప్రత్యేక యాప్ రూపొందించామని తెలిపిన అధికారులు
నిర్మాణ సామగ్రిని సమకూర్చడంలో నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలన్న సీఎం
విద్యుదీకరణకు అవసరమైన నాణ్యమైన సామగ్రిని కూడా లబ్ధిదారులకు అందుబాటులో ఉంచేలా ప్రయత్నాలు చేయాలన్న సీఎం
ఆప్షన్ 3 కింద, అంటే ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలన్న ఆప్షన్ ఎంపిక చేసుకున్న వారికి ఇళ్లు కట్టించి ఇచ్చే పనులు అక్టోబరు 25 నుంచి ప్రారంభం కావాలని సీఎం ఆదేశం
ఈలోగా అందుకు అవసరమైన సన్నాహకాలను పూర్తిచేయాలన్న సీఎం
ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్న చోట లబ్ధిదారులతో కలిసి గ్రూపులు ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు
జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధంచేశామని తెలిపిన అధికారులు
కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయంకూడా ఉండాలని స్పష్టంచేసిన సీఎం
*90రోజుల్లోగా ఇళ్లపట్టాల కార్యక్రమంపైనా సీఎం సమీక్ష*
ఆగస్టు 22 వరకూ ఇళ్లపట్టాల కోసం కొత్తగా వచ్చిన అప్లికేషన్లు 3,55,495
ఇందులో అర్హత ఉన్న దరఖాస్తులు 1,99,201
వెరిఫికేషన్‌కోసం పెండింగులో ఉన్న అప్లికేషన్లు 9,216
వీరికి పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం
*టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష*
ఫేజ్–1లో భాగంగా 85,888 ఇళ్ల పనులు పూర్తి చేశామన్న అధికారులు
ఈ కాలనీల్లో మౌలిక వసతుల పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్న అధికారులు
డిసెంబర్ 2021 నాటికల్లా ఈ ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తామన్న అధికారులు
ఫేజ్ –2 ఇళ్లు జూన్ 2022 నాటికి, ఫేజ్ –3 ఇళ్లు డిసెంబర్ 2022 నాటికి పూర్తవుతాయన్న అధికారులు
నిర్దేశిత సమయంలోగా ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామన్న అధికారులు
*పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకే ప్లాట్లు పథకాన్ని కూడా సమీక్షించిన సీఎం*
దాదాపు 3.94 లక్షల ప్లాట్లకు డిమాండ్ ఉందన్న అధికారులు
150, 200, 250 గజాల విస్తీర్ణంలో ప్లాట్లు
వివిధ రకాలుగా భూముల గుర్తింపు, సమీకరణ చేస్తున్నామన్న అధికారులు
విజయదశమి నాటికి కార్యాచరణ సిద్ధంచేసి అమలు తేదీలు ప్రకటించాలని సీఎం ఆదేశం
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ స్వచ్ఛభారత్ మిషన్ అర్భన్‌లో భాగంగా అందించే వాటర్ ప్లస్ సర్టిఫికేషన్‌కు ఏపీ నుంచి మూడు నగరాలకు చోటు
దేశ వ్యాప్తంగా కేవలం 9 నగరాలు మాత్రమే వాటర్‌ప్లస్ సర్టిఫికేట్ సాధిస్తే... అందులో 3 నగరాలు ఆంధ్రప్రదేశ్ నుంచి అర్హత సాధించాయని సీఎంకు వివరించిన పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లు వాటర్ ప్లస్ సర్టిఫికేట్ పొందాయన్న మంత్రి బొత్స సత్యనారాయణ
ఇళ్లు, వాణిజ్య సముదాయాల నుంచి డ్రైన్లు, నాలాలుతో పాటు ఇతర వ్యర్ధ జలాల శుద్ధి, నిర్వహణ, పునర్వినియోగాన్ని నిర్దేశిత ప్రమాణాల మేరకు సమర్ధవంతంగా నిర్వహించే నగరాలకు వాటర్ ప్లస్ సర్టిఫికేట్ అందిస్తున్న కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ
రాష్ట్రంలో మూడు నగరాలు వాటర్ ప్లస్ సర్టిఫికేట్లు సాధించడంపై అధికారులను ప్రశంసించిన సీఎం
ఉత్తమ తాగునీటి సరఫరా విధానాలు, మురుగునీటి నిర్వహణపై మార్గదర్శకాలను కలెక్టర్లుకు, కమిషనర్లకు పంపించాలని ముఖ్యమంత్రి ఆదేశం
రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాల్టీలలో ఈ గైడ్‌లైన్స్ అమలయ్యేలా చూడాలన్న సీఎం
తద్వారా రాష్ట్రంలోని పట్టణాలు ఉన్నత ప్రమాణాలు దిశగా అడుగులు వేయాలని సీఎం ఆదేశం
రాష్ట్రంలోని ప్రతి నగరం, మున్సిపాల్టీ కూడా సర్టిఫికేట్ పొందిన నగరాల స్ధాయిని చేరుకోవాలన్న సీఎం
ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, గృహనిర్మాణశాఖ కార్యదర్శి రాహుల్ పాండే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
addComments
Post a Comment