శ్రీవారికి ప్రధాన సేవ చేసుకునే భాగ్యం రెండోవ సారి నాకు పూర్వజన్మ సుకృతం..

 తిరుమల (ప్రజా అమరావతి); 


టిటిడి ఛైర్మన్ గా మరోసారి పదవి బాధ్యతలు చేపట్టనున్న వైవీ సుబ్బారెడ్డి..


రేపు ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్న వైవీ సుబ్బారెడ్డి..


తిరుపతిలోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న వైవీ సుబ్బారెడ్డి దంపతులు..


అమ్మవారి దర్శనంతరం శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు చేరుకున్న వైవీ సుబ్బారెడ్డి..


శ్రీవారికి ప్రధాన సేవ చేసుకునే భాగ్యం రెండోవ సారి నాకు పూర్వజన్మ సుకృతం..


స్వామి వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికే నడక మార్గం గుండా తిరుమలకు చేరుకున్నా..


గతంలో తెలిసో తెలియకో తప్పులు చేసి ఉంటే కాపాడమని స్వామి వారిని వేడుకుంటున్నా..


రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా ఉండాలి..దేశం వ్యాప్తంగా ఉన్న ప్రజలు కరోనా నుండి కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా..


గత రెండు సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని టిటిడి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాం..


కరోనా కారణంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించలేక పోయాం..రాబోయే రెండు ఏళ్ళల్లో వాటిని పూర్తి చేస్తాం..



త్వరలో పాలక మండలి సభ్యలను నియామకం ఉంటుంది..


పండితులతో ,పీఠాధిపతులను సంప్రదించి మంచి ముహూర్తంలో వైజాగ్ లో ఆలయంకు కుంభాభిషేకం నిర్వహిస్తాం..


కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో స్వామి వారి దర్శనంకు అనుమతిస్తాం..


దైవ సంకల్పం ఉన్నందు కారణంగానే నాకు మళ్ళీ ఛైర్మన్ గా పదవి లభించింది..


కరోనా కారణంగానే సర్వదర్శనంను నిలిపివేసాం..


*-వైవీ సుబ్బారెడ్డి, టిటిడి ఛైర్మన్-*

Comments