*చేనేతలకు ఇచ్చేది గోరంత - చెప్పేది కొండంత*
- *స్థానికంగా నేస్తం అందకుండా ఎవరు అడ్డుపడుతున్నారు?*
- *మంగళగిరిలో 1000 పైగా మగ్గాలు ఉంటే 130 మందే లబ్ధిదారులా..!*
- *పట్టణంలో అర్హులు ఎందరో ఎమ్మెల్యే ఆర్కే వస్తే చూపిస్తాం*
- *నేతన్నలను విస్మరిస్తే వైసీపీకి గుణపాఠం తప్పదు*
- *మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు హెచ్చరిక*
మంగళగిరి (ప్రజా అమరావతి);
రాష్ట్రంలో అర్హులైన చేనేత కార్మికులకు నిబంధనలు పేరుతో చేనేత పథకాలు అందకుండా చేస్తున్న వైసీపీ ప్రభుత్వం తీరును ఖండిస్తూ మంగళవారం స్థానిక ఎం.ఎస్.ఎస్ భవన్ లో స్థానిక టీడీపీ నాయకులు, చేనేత సంఘాల నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు.
మంగళగిరి చేనేతలకు నేతన్న నేస్తం పథకం రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారో చెప్పాలని, టీడీపీ హయాంలో చేనేత వర్గాలు అమలు పరిచిన పథకాలన్నింటీనీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
*తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి కామెంట్స్*ః
రాష్ట్రంలో చేనేత పరిశ్రమను, చేనేత కార్మికులను దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆదుకుంటున్నామని జగన్ రెడ్డి అసత్య ప్రకటనలతో నేతన్నలను మోసం చేస్తున్నారు.
గత 2 సంవత్సరాలుగా చేనేతలను ఆర్ధికంగా ఆదుకునేందుకు నేతన్న నేస్తం పథకంలో రూ.24 వేలు ఇస్తున్నామని గొప్పలు చెప్తున్నారు.
వాస్తవంగా చేనేతలను ఏ విధంగా జగన్ రెడ్డి నష్టపరుస్తున్నారో చేనేత కార్మికులు ఆలోచించాలి.
రాష్ట్రంలో 3.5 లక్షల మంది చేనేత కార్మికులు ఉంటే 80 వేల మందికి చేతన్న నేస్తం ఇస్తున్నారు.
చేనేత కార్మికులందరికీ రూ.24 వేలు ఇస్తున్నారా? ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వటంలేదో వైసీపీ నాయకులకు చెప్పాల్సిన బాధ్యత ఉంది.
నిబంధనలు పేరుతో అర్హులైన నేతన్నలకు పథకాన్ని అందకుండా చేస్తున్నారు.
చేనేత వృత్తిలోని అనుబంధ కార్మికులకు ఏ పథకం వర్తింప చేస్తున్నారు?
చేనేత కార్మికుల్లో లబ్ధిదారులను తగ్గించేందుకు దృష్టి పెట్టిన జగన్ రెడ్డి కార్మికులను ఆదుకోవటంలో దృష్టిసారించాలి.
చేనేతలకు ఇచ్చేది గోరంత. జగన్ రెడ్డి చెప్పుకునేది కొండంత.
టీడీపీ ప్రభుత్వంలో చేనేతలు అందరికీ పింఛన్లు, ప్రోత్సహకాలు, వర్షాకాలంలో భృతి, పావల వడ్డీ రుణాలు, సబ్సీడీతో మగ్గాలు కొనుగోలు, ఆరోగ్యబీమా, మరణించిన నేతన్నలకు పరిహారం వంటి పథకాలు అందించాం.
సొసైటీల్లో ఉన్న చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేత వర్గాలు అభివృద్ధి జరిగేలా జగన్ రెడ్డి ముందుకు వెళ్ళాలి.
మంగళగిరి చేనేతకు పుట్టినిల్లు. ఇక్కడ ప్రత్యక్షంగా చేనేత వృత్తిమీద ఆధారపడి బ్రతుకుతున్నారో.. ఎంతమందికి నేతన్న నేస్తం ఇస్తున్నారో స్థానిక వైసీపీ నాయకులు నిరూపించాలి.
మంగళగిరి చేనేతలకు నేతన్న నేస్తం పథకం రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారో స్థానిక వైసీపీ నేతలు చెప్పాలి.
నేతన్నలను విస్మరిస్తే భవిష్యత్‌లో వైసీపీకి గుణపాఠం చెప్తారు.
గతంలో టీడీపీ ప్రభుత్వం నేతన్నలకు ఇచ్చిన సబ్సీడీలు, రుణాలు, ప్రోత్సహక పథకాలు పునరుద్ధరించాలి.
చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం అందించాలి.
*చేనేత సంఘం నాయకులు, మంగళగిరి నియోజకవర్గం టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు కారంపూడి అంకమరావు కామెంట్స్*ః
వైసీపీ ప్రభుత్వం ఇస్తున్నది నేతన్న నేస్తం కాదు, నేతన్నను మోసం చేస్తున్నారు.
రాష్ట్రంలో 3.5 లక్షల మంది నేతన్నలు ఉంటే కేవలం 80 వేలమందికే రూ.24 వేలు ఇస్తున్నామని చెప్తుననారు. వీరిలో ఎంతమందికి అందుతుందో చెప్పలేము.
అందుకే నేతన్నలు అందరూ కళ్లు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది.
టీడీపీ హయాంలో నేతన్నలకు ప్రోత్సహకాలు, త్రిఫ్టు, సిల్కు కొనుగోలుపై రాయితీలు, ఆరోగ్య బీమా, మల్బరీ తోటల పెంపకానికి ప్రోత్సహకాలు వంటి పథకాలు అందించారు.
మంగళగిరిలో 1000 పైగా మగ్గాలు ఉన్నాయి. వీరిలో కేవలం 130 మందికే నేతన్న నేస్తం ఇస్తున్నారు.
నియోజకవర్గంలో 130 లబ్ధిదారులే ఉన్నారా? పట్టణంలో ఎంతమంది అర్హులో ఉన్నారో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వస్తే చూపిస్తాం.
*చేనేత సంఘం నాయకులు, ఏఎంసీ మాజీ వైస్ ఛైర్మన్ గుత్తికొండ ధనుంజయరావు కామెంట్స్*ః
దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోంది.
చేనేత వర్గాలను నట్టేట ముంచిన ఘనత జగన్ రెడ్డిదే
చేనేత కార్మికులందరికీ ప్రతీ సంవత్సరం రూ.24 వేలు ఇస్తామని చెప్పిన జగన్ రెడ్డి తరువాత సొంత మగ్గం ఉన్న వారికే ఇస్తామని మాట మార్చారు.
రాష్ట్రంలో 80 వేలమందికి నేతన్న నేస్తం ఇస్తున్నామని ఈ ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఎంతమందికి ఇస్తారో ఇవ్వరో కూడా తెలియదు.
మోసపూరిత విధానలతో వైసీపీ పాలన సాగుతోంది.
నూలు, రంగులు ధరలు పెరిగాయి. ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయకుండా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది.
చేనేతలు అందరికీ ప్రభుత్వ పథకాలు అందించే వరకు ఉద్యమించి ప్రభుత్వ మెడలు వంచుతాం.
సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ కేవలం మగ్గం ఉన్న వారికే నేతన్న నేస్తం పథకం అని నిబంధన పెట్టడం జగన్ రెడ్డి దుర్మార్గానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. చేనేత రంగంలో నూలు వడకడం, రాట్నం తిప్పడం, దారం బొందులు ఎక్కించడం, రంగులు అద్దకం వంటి పనులు చేసే కార్మికులు పరిస్థితి ఏంటని నిలదీసారు.
కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్, సీనియర్ టీడీపీ నాయకులు ఊట్ల శ్రీమన్నారాయణ, బట్టు చిదానంద శాస్త్రి, ఎ. కృష్ణారావు, ఇమంది రాజారావు, జంజనం శ్రీనివాసరావు, జంజనం వెంకట సుబ్బారావు, తిరువీధుల బాపనయ్య, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment