లక్షణాలు కన్పిస్తే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం

 


- లక్షణాలు కన్పిస్తే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం 


- డివిజన్లో ఒక్కరోజే 1,033 పరీక్షలు చేశాం 

- 1.86 శాతానికి తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, ఆగస్టు 26 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో పాఠశాలలు తెరిచిన నేపథ్యంలో విద్యార్థుల్లో ఎవరికైనా లక్షణాలు కన్పిస్తే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, ఈ మేరకు సీఎం జగన్మోహనరెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసులు, పాజిటివిటీ శాతంపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. గుడివాడ డివిజన్లో బుధవారం ఒక్కరోజే 1,033 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. గుడివాడ రూరల్ మండలంలో 46 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి వైరస్ సోకిందని తెలిపారు. గుడివాడ పట్టణంలో 173 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా వైరస్ సోకిందన్నారు. ముదినేపల్లి మండలంలో 132 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి కరోనా వైరస్ సోకిందన్నారు. పామర్రు మండలంలో 150 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒకరికి వైరస్ సోకిందన్నారు. కైకలూరు మండలంలో 70 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి వైరస్ సోకిందన్నారు. గుడ్లవల్లేరు మండలంలో 37 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా సోకిందన్నారు. కలిదిండి మండలంలో 130 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా సోకిందని తెలిపారు. నందివాడ మండలంలో 49 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి కరోనా వైరస్ సోకిందన్నారు. పెదపారుపూడి మండలంలో 228 మందికి, మండవల్లి మండలంలో 18 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఏ ఒక్కరికీ వైరస్ సోకలేదని చెప్పారు. డివిజన్ లో కరోనా పాజిటివిటీ రేటు 1.36 శాతానికి తగ్గిందని మంత్రి కొడాలి నాని తెలిపారు.