న్యూమోనియా వ్యాధిని అరికట్టేందుకు చిన్న పిల్లలకు న్యూమొకోకల్ కాంజుగేటివ్ టీకాను

 


నెల్లూరు, ఆగస్టు 25 (ప్రజా అమరావతి):  న్యూమోనియా వ్యాధిని అరికట్టేందుకు చిన్న పిల్లలకు న్యూమొకోకల్ కాంజుగేటివ్ టీకాను


తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు సూచించారు. బుధవారం నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని వెంగల్ రావు నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము నందు న్యూమొకోకల్ కాంజుగేటివ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లలకు ఈ వ్యాక్సిన్ ను ఏడాదిలోపు చిన్నారులకు 6 వారాలకు, 14 వారాలకు, 9 నెలలకు బూస్టర్ డోసు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ టీకాను జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి బుధవారం, శనివారం నిర్వహించే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇవ్వనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ గణేష్ కుమార్, నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజ్యలక్ష్మి, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ ఆర్ స్వర్ణలత, వైద్యులు ఉమా మహేశ్వర రావు,  అమరేంద్ర, అమర్ నాథ్  రెడ్డి, సందీప్, డెమో అధికారి శ్రీనివాసులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.