*వ్యాక్సిన్‌కు కొరత లేదు*
*18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయించాలి*
*వ్యాక్సినేషన్ కేంద్రంగా ఎస్.కోట జూనియర్ కళాశాల కొనసాగింపు*
*ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించేలా చైతన్య పరచాలి*
*ఇళ్ల నిర్మాణాలకు లబ్దిదారులను ప్రోత్సహించాలి; జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి*
*ఎస్.కోటలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన*
*గ్రామ సచివాలయం, వ్యాక్సినేషన్ కేంద్రం తనిఖీ*
*విజయనగరం, ఆగష్టు 24 (ప్రజా అమరావతి); జిల్లాలో కోవిడ్ వ్యాప్తి జరగకుండా నిరోధించేందుకు వ్యాక్సినేషన్‌పై అధికంగా దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి చెప్పారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకొనేలా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితులను దృష్టిలో వుంచుకొని ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్న వారు, వ్యాపార సంస్థలు దుకాణాల్లో వుండే వారికి జరిమానాలు విధించాలన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి మంగళవారం ఎస్.కోట మండల కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించారు. మండలంలోని ఒక గ్రామంలో అధికంగా కోవిడ్ కేసులు వచ్చిన నేపథ్యంలో కంటెయిన్ మెంట్ జోన్ గా ప్రకటించిన నేపథ్యంలో మండలంలోని అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి సిబ్బందితోను, తహశీల్దార్‌తో మాట్లాడి కోవిడ్ పరిస్థితులపై ఆరా తీశారు. వ్యాక్సినేషన్ ఏవిధంగా జరుగుతుందో తెలుసుకున్నారు. మండల కేంద్రంలో శాశ్వత వ్యాక్సినేషన్ కేంద్రం లేకపోవడంతో తరచూ వ్యాక్సినేషన్ కేంద్రాల మార్పు వల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నట్టు పలువురు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. దీనిపై స్పందిస్తూ జూనియర్ కళాశాలను శాశ్వత వ్యాక్సినేషన్ కేంద్రంగా కొనసాగిస్తామని చెప్పారు. ప్రతిరోజూ ఇక్కడ వ్యాక్సినేషన్ కొనసాగుతుందన్నారు.*
*జిల్లా కలెక్టర్ ఎస్.కోట మండల కేంద్రంలోని ఒకటో నెంబరు, రెండో నెంబరు గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. అక్కడ సిబ్బందితో మాట్లాడి వారు నిర్వహిస్తున్న విధులను తెలుసుకున్నారు. గ్రామంలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో ఇళ్లు మంజూరైన లబ్దిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టేలా వారిని ప్రోత్సహించాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లకు సూచించారు. గ్రామ సచివాలయానికి వచ్చే వినతులను సకాలంలో పరిష్కరిస్తున్నదీ లేనిదీ డిజిటల్ అసిస్టెంట్‌లతో ఆరా తీశారు. గ్రామంలోని మత్స్యకారులు రాయితీలతో పనిలేకుండా బ్యాంకు రుణాలతో చేపల రవాణాకోసం సౌరశక్తితో వ్యాన్‌లు పొందడానికి ఆసక్తి చూపితే వెంటనే బ్యాంకులతో మాట్లాడి అందించే ఏర్పాట్లు చేస్తామని మత్స్యకారులతో మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకోవాలని మత్స్యశాఖ సహాయకురాలికి చెప్పారు.*
*జారీ సహాయ సంచాలకులు, సమాచార పౌరసంబంధాల శాఖ, విజయనగరం*
addComments
Post a Comment