రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ నేతన్న నేస్తం మూడో


 

నెల్లూరు, ఆగస్టు 10 (ప్రజా అమరావతి):  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ నేతన్న నేస్తం మూడో విడత నగదును ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేతన్నల ఖాతాల్లోకి జమ చేశారు. మంగళవారం సీఎం తాడేపల్లిలోని వారి క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణం నుంచి జిల్లా కలెక్టర్ శ్రీ  కెవిఎన్ చక్రధర్ బాబు, ఇతర అధికారులు హాజరయ్యారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తన పాదయాత్రలో నేతన్నల కష్టాలు చూసి వీరిని ఎలాగైనా ఆదుకోవాలనే సంకల్పంతో ఇచ్చిన హామీ మేరకు వారి ఆర్థిక అభివృద్ధి కోసం వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని రూపొందించినట్లు చెప్పారు. మగ్గముల ఆధునీకరణ, నిర్వహణ పెట్టుబడిగా సంవత్సరమునకు 24 వేల రూపాయలు అర్హుడైన ప్రతి చేనేత కార్మికుడికి అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రెండేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొని నేడు మూడో విడత నగదు నేతన్నల ఖాతాలలో జమ చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 వేల మందికి 192.08 కోట్లు మూడో విడతగా నేడు విడుదల చేసినట్లు వివరించారు.

 అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు  వైయస్సార్ నేతన్న నేస్తం మెగా చెక్కును ఎమ్మెల్సీ శ్రీ కళ్యాణ్ చక్రవర్తితో కలిసి చేనేత కార్మికులకు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 6697  మంది చేనేత కార్మికులకు 16,07,28,000 రూపాయలను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు జమ చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. స్పందన కార్యక్రమంలో నేతన్నలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి ప్రభుత్వంతో మాట్లాడి మరో వెయ్యి మందికి కూడా నేతన్న నేస్తం పథకం వర్తింప చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం జమచేసిన 24 వేల రూపాయల  నగదును చేనేత కార్మికులు మగ్గం మరమ్మతులు, మెటీరియల్ కొనుగోలుకు వినియోగించుకోవాలని సూచించారు. ఇంకా ఎవరైనా అర్హులై ఉండి నగదు జమ కాని వారు ఇప్పటినుంచి ఒక నెలలోపు స్థానిక సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు శ్రీ గణేష్ కుమార్, శ్రీమతి రోజ్ మాండ్, జడ్పీ సీఈఓ శ్రీమతి సుశీల, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఆనంద్ కుమార్,  వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి నక్క భానుప్రియ, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ నక్కా వెంకటేశ్వర్లు, నెల్లూరు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీ ధోనిపర్తి శ్రీనివాసులు, తొగట కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి  ఆదిలక్ష్మి, హ్యాండ్లూమ్స్ డివోలు, ఏడివో లు తదితరులు పాల్గొన్నారు.


చేనేత కార్మికుల అభిప్రాయాలు

................................

చెప్పలేని ఆనందంగా ఉంది

- పృథ్వి శ్రీనివాసులు, కోవూరు

::- నేను కోవూరులో గత నలభై సంవత్సరాలుగా మగ్గం నేస్తున్నాను. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. పస్తులుండి మా కుటుంబాన్ని పోషించుకునే వాడిని. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మా జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా అప్పులు చేయకుండా ప్రభుత్వం వారు ఇచ్చే నేతన్న నేస్తం డబ్బులను పెట్టుబడిగా పెట్టి సొంతంగా చీరలను తయారుచేసి అమ్ముకుంటున్నాము. దీంతో ఆర్థికంగా మేము చాలా వరకు మెరుగు పడ్డాము.2). జీవితాంతం రుణపడి ఉంటాం

- పాముజుల వెంకటేశ్వర్లు, కోవూరు

..-  ఎవరూ పట్టించుకోని చేనేత కార్మికులను జగన్మోహన్ రెడ్డి అక్కున చేర్చుకోవడం మా పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఇచ్చిన మాట ప్రకారం వరుసగా మూడో ఏడాది కూడా 24000 జమచేసి మా కుటుంబాలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం.


3). ఆత్మగౌరవంతో జీవిస్తున్నాం

:- అడిగోపుల మాధవి, భక్తవత్సల నగర్, నెల్లూరు

- మాది పేద కుటుంబం. నా భర్త సంపాదన ఇంటి ఖర్చులకు సరిపోయేది. ఇతర అవసరాలకు చాలా ఇబ్బందులు పడే వాళ్ళం. నేను చాలా సంవత్సరాలుగా మగ్గం పని చేస్తున్నాను. అయితే మగ్గం పనులు లేక, మగ్గం మరమ్మతులు చేయించలేక బయట అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక చాలా బాధలు పడేవాళ్ళం. ఇప్పుడు జగనన్న దయవల్ల మా కుటుంబం ఆనందంగా ఉంది. దిగ్విజయంగా మూడో విడత ఇరవై నాలుగు వేల రూపాయలను నేను పొందాను. ప్రతి  సంవత్సరం జగనన్న ఇచ్చే ఈ ఆర్థిక సాయంతో మగ్గం రిపేర్ చేసుకొని, మెటీరియల్ ను కొనుగోలు చేసుకుని సొంతంగా వ్యాపారం చేసుకొని ఆత్మగౌరవంతో జీవిస్తున్నాం.   మా జీవితాల్లో వైయస్సార్ నేతన్న నేస్తం పథకం వెలుగులు పూయించింది. చేనేత కుటుంబాలకు కొండంత అండగా నిలిచిన జగనన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.


Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image