ఆపదలో ఉన్న ఆడబిడ్డను ఆదుకున్న దిశా యాప్....

 *గుంటూరు రూరల్ పోలీస్..(ప్రజా అమరావతి);


*ఆపదలో ఉన్న ఆడబిడ్డను ఆదుకున్న దిశా యాప్....


*


దట్టమైన అటవీ ప్రాంతములోని చిమ్మ చీకటిలో వెలుగు నింపిన దిశా యాప్....


దిశా యాప్ SOS కాల్ పై సత్వరమే స్పందించి, యువతిని రక్షించిన పిడుగురాళ్ల పట్టణ పోలీసులు.


 బంధువులతో పాటు గుత్తికొండ బిలం సందర్శనకు వెళ్లిన యువతి....


 దర్శనం అనంతరం ఆటోలో బయలు దేరిన బంధువులు, స్కూటీపై వస్తున్న యువతి.


 వర్షం కారణంగా తడుస్తానేమో అని భావించి కొంచెం సేపు చెట్టు కింద నిరీక్షించిన యువతి.ఆటోలో వెళ్లిపోయిన బంధువులు.

వర్షం వలన బురదమయమైన రహదారి, స్కూటీపై ముందుకు వెళ్లాలని చేసిన ప్రయత్నం విఫలం. ఈ లోగా చీకటి కమ్మగా ఎటు వెళ్లాలో తెలియని నిస్సహతా ఆమెను భయ బ్రాంతులకు గురిచేసాయి.


*తాను ఇక్కడే చిక్కుకు పోయానే అయి రోధిస్తున్న తరుణములో దిశా SOS బటన్ నొక్కి పోలీస్ వారి సహాయాన్ని కోరడం జరిగినది.*


 దిశా SOS కు వచ్చిన కాల్ పై వెంటనే స్పందించిన పిడుగురాళ్ల పట్టణ సీఐ ప్రభాకర్, ఎస్సై చరణ్ కి సమాచారాన్ని అందించి వెంటనే తనని బాధితురాలిని రక్షించమని ఆదేశించడం జరిగినది.


 ఎస్సై చరణ్ గుత్తికొండ మహిళా పోలీస్ వారి సహయముతో యువతిని రక్షించి, క్షేమంగా వారి బంధువులకు అప్పగించడం జరిగినది.


 ఆపదలో ఉన్న తనను దిశా యాప్ ద్వారా రక్షించిన పిడుగురాళ్ల పట్టణ సీఐ ప్రభాకర్ కి, ఎస్సై చరణ్ కి మరియు మహిళ పోలీస్ వారికి యువతి కృతజ్ఞతలు తెలిపింది.


ప్రతి ఒక్కరు దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని, ఆపదలో ఉన్న వారికి దిశా యాప్ అండగా మరియు అభయంగా ఉంటుందని తెలిపింది.*

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image