గుంటూరు రూరల్ పోలీస్.(ప్రజా అమరావతి);
గుంటూరు రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయములో నిర్వహించిన *డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమము* లో పాల్గొని ప్రజలతో మాట్లాడి,స్వయముగా *వారి సమస్యలను రాసుకుని*,వాటిని సత్వరమే పరిష్కరించవలసినదిగా పోలీస్ అధికారులను ఆదేశించిన రూరల్ ఎస్పీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ ,.
ఈ సందర్భముగా ఎస్పీ గారు మాట్లాడుతూ.....
ఈ రోజు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి 15 ఫోన్ కాల్స్ వచ్చాయి.
స్థలం,పొలం మరియు భార్యాభర్తల గొడవల ఫోన్ కాల్స్ ఎక్కువగా ఉన్నాయి.
ఈ కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరిస్తున్నందుకు ప్రజలు సందేశాలు/ఫోన్ కాల్స్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
పిడుగురాళ్లకు చెందిన ఒక మహిళ వద్ద డబ్బులు తీసుకుని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతునారు అని డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమములో ఫిర్యాదు చేయగా,పిడుగురాళ్ల సీఐ ప్రభాకర్ గారిని ఆదేశించగా,సీఐ గారు సత్వరనే *తన సమస్యను పరిష్కరించినందుకు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలపడం ఎంతో సంతోషం అనిపించింది.
ప్రజలు ఈ విధముగా తెలిపే కృతజ్ఞతలు మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహముతో పనిచేయడానికి,తద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందివ్వడానికి ఉపయోగపడతాయి.
దాచేపల్లిలోని తన గృహములో రెండు సార్లు దొంగతనం జరిగినదని,తగిన చర్యలు తీసుకోవాలని ఒక గృహిణి కోరగా,సమస్య పరిష్కారానికి దాచేపల్లి ఎస్సైగారిని ఆదేశించడం జరిగినది.
మా రూరల్ జిల్లా ప్రజలు ఇంటి నుండి రెండు మూడు రోజులు ఎక్కడికైనా వెళ్తుంటే, దగ్గరలోని పోలీస్ వారికి సమాచారం అందిస్తే,వెంటనే పోలీస్ వారు మీ గృహాలకు సీసీ కెమెరాలను అమర్చి, *లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం(locked house monitoring system - LHMS)* అనే వ్యవస్థ ద్వారా మీరు వచ్చే వరకు నిరంతరం కాపాలకాయడం జరుగుతుంది.
అదే విధముగా ఆ ప్రాంతములో మా గస్తీ సిబ్బందిని కూడా నియమించి,పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అలాగే ప్రజలు కూడా తమ గృహాలలో ఎక్కువగా నగదు గాని,నగలు గాని పెట్టుకోరాదు.ఏదైనా దేవాలయాలకు,కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఎక్కువ నగలు ధరించి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
SC/ST కేసుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని రొంపిచర్ల పోలీస్ స్టేషన్ పరిధి నుండి ఒక ఫోన్ కాల్ వెంటనే నరసరావుపేట డిఎస్పీ గారిని ఆదేశించి,SC/ST కేసులలో దర్యాప్తును 60 రోజులలో పూర్తి చేసి న్యాయస్థానములో ఛార్జ్ షీట్ దాఖలు చేయవలసినదిగా అందరూ డిఎస్పీలను ఆదేశించడం జరిగినది.
స్పందన,వాట్సాప్ హెల్ప్లైన్ నెంబర్, డయల్ యువర్ ఎస్పీ మొదలగు వాటికి వచ్చిన ఫిర్యాదులను, స్వయముగా ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి,ఫిర్యాదు దారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించడం జరిగినది.
ఈ రోజు రూరల్ జిల్లా నుండి మాత్రమే కాదు విదేశాల నుండి,ఇతర జిల్లాల నుండి కూడా ఫోన్ కాల్స్ రావడం జరిగినది.
రూరల్ జిల్లా ప్రజలు,మేరకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే వాట్సాప్ హెల్ప్లైన్ నెంబర్ 8866268899 కి గాని,డయల్ యువర్ ఎస్పీ -8688405050 కి గాని,స్పందన,మహిళ మిత్ర మరియు డయల్ 100 ద్వారా గాని తమ సమస్యను చెప్పుకోవచ్చు.
మీకు అత్యుత్తమ సేవలు అందివ్వడానికి పోలీస్ వారు నిరంతరం అందుబాటులో ఉన్నారు.
addComments
Post a Comment