అమరావతి (ప్రజా అమరావతి);
కృష్ణా జిల్లా నందిగామ శివారు అనసాగరం జడ్ పి హైస్కూల్ ఘటనపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కామెంట్స్....
పాఠశాలల్లో విద్యార్థులను పనులకు వినియోగించటంపై సీరియస్.
ఇక్కడి పాఠశాలలో విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి చెందటం బాధాకరం. సంఘటన పై తక్షణమే ప్రాధమిక నివేదిక తెప్పించాం.సంఘటన పై ఆర్జేడీ తో విచారణ జరుపుతున్నాం.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది.
పాఠశాలల్లో పనులకు నియమించుకున్న ఆయాలను వినియోగించుకోవాలి.ఎక్కడైనా విద్యార్థులతో పనులు చేయిస్తున్నట్లు తెలిస్తే ఉపేక్షించేదిలేదు.ఈ సంఘటన లో మృతి చెందిన విద్యార్థి గోపీచంద్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం.వారి కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటాం.
addComments
Post a Comment