తాడిపత్రి కోవిడ్ ఆసుపత్రి నందు సీసీ టీవీలు ఏర్పాటు చేసుకోండి

 తాడిపత్రి   కోవిడ్ ఆసుపత్రి నందు సీసీ టీవీలు  ఏర్పాటు చేసుకోండి 

జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్*


అనంతపురం, ఆగస్టు 12 (ప్రజా అమరావతి) :


*జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ గురువారం తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించారు. తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాలలో గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ల భవనాలు, పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్ల గ్రౌండింగ్, కోవిడ్ ఆస్పత్రి పరిశీలన లాంటి పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ తాడిపత్రిలో   కోవిడ్  ఆసుపత్రి ఆవరణ లో పాత్రికేయులతో మాట్లాడారు.*


*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న వివిధ ప్రభుత్వ భవనాలు  స్థాయిలో ఉన్నాయి, ఆయా భవనాల పురోగతి ఎ ఉందో సంబంధిత శాఖ అధికారులతో చర్చించడం జరిగిందన్నారు. దాంతో పాటు పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట, తాడిపత్రి మండలం లోని హుసేనాపురం గ్రామాలలో భవన నిర్మాణాలను, గ్రామ సచివాలయాలను పరిశీలించామన్నారు. ఆయా గ్రామ సచివాలయాలలో సచివాలయ ఉద్యోగులతో మాట్లాడి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల అమలు తీరును తనిఖీ చేయడం జరిగిందన్నారు. అలాగే నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కింద ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తాడపత్రి మున్సిపాలిటీ లో 3700 ఇల్లు మంజూరు చేయడం జరిగిందని, అందులో ఎన్ని ఇల్లు గ్రౌండింగ్ జరిగాయి, అందులో ఏవైనా సమస్యలు ఉన్నాయా అడిగి తెలుసుకొని ఇల్లు గ్రౌండింగ్ చేయాలంటే ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి అనే విషయం పై చర్చించామన్నారు. అలాగే రెండు నెలల కింద తాడిపత్రిలో కోవిడ్ ఆస్పత్రికి సంబంధించి ఎంఎస్ఐడిసి, అర్జాస్ స్టీల్ ప్లాంట్ వారు కలిసి ఆక్సిజన్ పైప్ లైన్ వేయడం జరిగిందని, ఆస్పత్రిని తనిఖీ చేయడం జరిగిందన్నారు. పటిష్టమైన భద్రత,  సీసీటీవీ ల ఏర్పాటుకు, ఏర్పాటు చేసుకోవాలని   సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని  పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని, ఇతర దేశాలలో, దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా కేసులు మెల్లమెల్లగా పెరిగే అవకాశముందని, కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించి థర్డ్ వేవ్ సన్నద్ధత ఎలా ఉంది, ఇంకా ఏమైనా మౌలికసదుపాయాల అవసరమవుతాయా అనే దానిపై ఈరోజు కరోనా ఆస్పత్రిని తనిఖీ చేశామన్నారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అక్కడ కరోనా పేషంట్ లు తక్కువగా ఉన్నారని, కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఎంత మంది  మాన్ పవర్  అవసరమవుతారు అనేది సంబంధించిన అధికారులతో చర్చించడం జరిగిందన్నారు. ఇంటింటికి రేషన్ పంపిణీపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మానిటర్ చేస్తున్నామని, రేషన్ ఇంటి వద్దకే వచ్చి అందించారా లేదా అనేది లబ్ధిదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని తెలిపారు , 

ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్డీవో మధుసూదన్, ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీనివాస్ రెడ్డి, నోడల్ ఆఫీస్ రవిశంకర్, ఆక్సిజన్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఇంజనీర్లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


------------------------------------------------- 

సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, అనంతపురం వారిచే జారీ..

Comments