నేటితో ముగిసిన పవిత్రోత్సవములు:
శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి):
ఈ రోజు ఉదయం అనగా ది.23-08-2021 శ్రావణ బహుళ పాడ్యమి ఉదయం ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారి ఆధ్వర్యంలో వైదిక కమిటీ సభ్యులు మరియు అర్చక సిబ్బంది నిర్వహించిన మహా పూర్ణాహుతి కార్యక్రమముతో పవిత్రోత్సవములు దిగ్విజయంగా పరిసమాప్తి కాబడినవని తెలియజేశారు. ఈ కార్యక్రమం నందు గౌరవ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ఈరోజు నిర్వహించిన కార్యక్రమ వివరములు:
- ఉ.9 గం.ల వరకు మూలమంత్రం హవణములు, శాంతిక పౌష్టిక హోమములు, కూష్మాండబలి.
- ఉ.9 గం.లకు మహా పూర్ణాహుతి, కలశోద్వాసన, మార్జన, మహదాశీర్వచనము తో కార్యక్రమము సమాప్తి.
addComments
Post a Comment