శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):  కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు DoNER(డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్) మంత్రివర్యులు శ్రీ జి.కిషన్ రెడ్డి గారు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి జి.వాణీ మోహన్, IAS గారు, ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు , ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

అనంతరం కేంద్రమంత్రి వర్యులు శ్రీ జి.కిషన్ రెడ్డి గారికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించి, పూజలు నిర్వహించారు. అనంతరం  కేంద్ర మంత్రివర్యుల శ్రీ జి.కిషన్ రెడ్డి గారి కుటుంబమునకు ఆలయ స్థానాచార్యులు వారి ఆధ్వర్యంలో వైదిక కమిటీ సభ్యులు మరియు వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్  శ్రీ అమ్మవారి ప్రసాదములు మరియు చిత్రపటం అందజేశారు.

Comments