*స్పందన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి*
స్పందనలు వచ్చినా ప్రతి అర్జీని పరిష్కరించే దిశగా అధికారుల కృషి చేయాలి
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కచ్చితంగా ఈ ఆఫీసు ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలి
*: జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్*
అనంతపురం, ఆగస్టు 2 (ప్రజా అమరావతి);:
*అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో సోమవారం స్పందన గ్రీవెన్స్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన
ప్రజల నుంచి 492 అర్జీలనుజిల్లా కలెక్టర్ స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న జిల్లా కలెక్టర్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, డిఆర్ఓ గాయత్రీ దేవిలు, అనంతపురం ఆర్డీవో మధుసూదన్, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.*
*స్పందన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్*
*స్పందన సమస్యలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎప్పటికప్పుడు పరిష్కరం చూపించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. సోమవారం వచ్చిన స్పందన సమస్యలను వచ్చే సోమవారం నాటికి పూర్తిగా పరిష్కరించాలన్నారు. జిల్లా అధికారులు, జిల్లా వ్యాప్తంగా డివిజన్, మండల స్థాయి అధికారుల లాగిన్ లలో పెండింగ్ ఉన్న గడువు తీరిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. స్పందన గ్రీవెన్స్ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మానిటర్ చేస్తున్నారని, స్పందన సమస్యలు పెండింగ్ ఉంచకుండా జాగ్రత్తగా పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఖచ్చితంగా ఈ ఆఫీసు ద్వారా కార్యక్రమాలు చేపట్టాలని. ఈ ఆఫీసు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తాసిల్దారు, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయంలో 100 శాతం అన్ని ఫైలు ఈ ఆఫీసులో ఉండాలని తెలిపారు.
*ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్ మాట్లాడుతూ స్పందన గ్రీవెన్స్ సమస్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ పెండింగ్ ఉంచరాదన్నారు. గడువు తీరిన స్పందన గ్రీవెన్స్ సమస్యలను రేపటి లోపు అధికారులు తమ లాగిన్ లో చెక్ చేసి వాటిని పరిష్కరించడం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా స్థాయిలో, క్షేత్రస్థాయిలోని అధికారులు గడువు తీరిన సమస్యలను చూడాలని, స్పందన సమస్యల పరిష్కారం పై సీరియస్ గా దృష్టి సారించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 342 స్పందన సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, స్పందన లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అందులో జిల్లా సాండ్ (ఇసుక) ఆఫీసర్, వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వివిధ మున్సిపాలిటీలలో కూడా తదితర శాఖలకు సంబంధించి అత్యధిక అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే వాటికి పరిష్కారం చూపించాలని ఆదేశించారు.*
ఈరోజు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా మొత్తం 492 అర్జీలు వచ్చాయి. ఇందులో కొన్ని సమస్యల వివరాలు ఇలా ఉన్నాయి.*
జిల్లా నలుమూలల నుండి మొత్తం దరఖాస్తులు ----- వచ్చాయి . ఇందులో సమస్యలతో కొన్ని వినతుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాలో భవన నిర్మాణ కార్మికుల బోర్డు కు సంబంధించిన నిధులను అర్హులైన కార్మికులకు ప్రభుత్వం అందించడం లేదని ఈ విషయంలో తమకు న్యాయం చేయాల్సిందిగా లక్ష్మీనారాయణ ఈశ్వరయ్య తదితరులు వినతిపత్రం సమర్పించారు.
ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు చేనేత కార్మికులు చేనేత సంఘాలు చేనేత కు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్ అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పోలా రామాంజనేయులు మోహన్ చంద్రమౌళి తదితరులు వినతిపత్రాన్ని సమర్పించారు.
ఉరవకొండ షేక్ షాని పల్లి బీసీ కాలనీ కి చెందిన హుసేన్ బీ కి అర్హత ఉన్నా కూడా వితంతు పెన్షన్ మంజూరు కావడం లేదని నిరుపేద అయిన తనకు ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయవలసిందిగా వినతిపత్రాన్ని సమర్పించారు.
అనంతపురం కు చెందిన శాంతకుమారి భర్త లేట్ ఆంజనేయులు ఆర్మీలో పని చేసినందుకు ప్రభుత్వం 4.90 ఎకరాల భూమిని ధర్మవరం రేగాటి పల్లెలో మంజూరు చేసిందని అయితే కౌలుదారులు అయిన ఈశ్వరయ్య ఇతరులు ఆ భూమిని ఆక్రమించుకున్నారని పేర్కొంటూ ఈ విషయంలో తనకు న్యాయం చేయవలసినదిగా బాధితురాలు అర్జీని సమర్పించింది.
గత రెండు నెలల క్రితం తన భార్య కోవిడ్ కారణంగా మరణించిందని పేద కుటుంబానికి చెందిన తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని అందువల్ల ప్రభుత్వం ఏదోవిధంగా ఆర్థిక సహాయాన్ని అందించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ అమరాపురం మండలం అగ్రహారం కు చెందిన ఉమేష్ వినతిని సమర్పించారు.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి విడుదల చేసిన నష్టపరిహారాన్ని తనకు లభించే విధంగా చర్యలు తీసుకోవాలని హిందూపురం కు చెందిన సరస్వతి వినతిపత్రాన్ని సమర్పించింది.
కళ్యాణదుర్గం మండలం నాయన పల్లి గ్రామానికి చెందిన గిరిజ అనే మహిళా రైతుకు తిమ్మన సముద్రం పొలం సర్వేనెంబర్ 290-1 విస్తీర్ణం 3.57 సెంట్ల భూమికి సంబంధించి వెబ్ ల్యాండ్ అడంగల్ నందు తన పేరు నమోదు చేయాలని వినతిపత్రాన్ని సమర్పించింది.@ అనంతపురం రూరల్ మండలం కురుగుంట వైయస్సార్ కాలనీకి చెందిన శిల ఈశ్వరమ్మ కు అర్హత ఉన్నందున చేనేత కార్డుపై పెన్షన్ మంజూరు చేయాల్సిందిగా వినతిపత్రాన్ని సమర్పించింది.
అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, పాస్ పుస్తకాలు మంజూరు భూమి తగాదాలను పరిష్కరించాలంటూ వివిధ అంశాలతో కూడిన వినతులను ప్రజల నుండి అధికారులు స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఓ ప్రేమ చంద్ర, డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, హార్టికల్చర్ డిడి సతీష్, సోషల్ వెల్ఫేర్ డిడి విశ్వమోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్ రెడ్డి, డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్, డిసిహెచ్ఎస్ రమేష్ నాథ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరప్రసాద్, శ్రీనివాసులు, డిటిడబ్ల్యూఓ అన్నాదొర, స్పందన తహశీల్దార్ అనుపమ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment