శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):  ఈ రోజు తేది. 25 -08 -2021 న మహామండపము 6 వ ఫ్లోర్ నందు  కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ హుండీ లెక్కింపు కార్యక్రమము నిర్వహించడం జరిగినది. హుండీ లెక్కింపు కార్యక్రమమును ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ గారు, పాలకమండలి సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది మరియు SPF  సిబ్బంది పర్యవేక్షించారు. 


ఈ రోజు హుండీ లెక్కింపు రిపోర్టు :-

లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ. 2,04,84,358/- లు.


హుండీల ద్వారా వచ్చిన బంగారం:  625 గ్రాములు, 


హుండీల ద్వారా వచ్చిన వెండి: 5 కేజీల 415 గ్రాములు 


లెక్కించిన హుండీ లు  : 33

గడచిన రోజులు : 16


భ‌క్తులు కానుక‌ల రూపంలో శ్రీ అమ్మ‌వారికి స‌మ‌ర్పించారు.  గడచిన 16 రోజులలో సగటున రోజుకు 12.80లక్షల చొప్పున దేవస్థానం నకు హుండీల ద్వారా ఆదాయం చేకూరింది.


మరియు రాష్ట్ర దేవాదాయశాఖ వారి website  www.aptemples.ap.gov. in ద్వారా ది.09-08-2021 నుండి ది.24-08-2021 వరకు online నందు e- హుండీ ద్వారా రూ. 28,981/- లు భక్తులు శ్రీ అమ్మవారి దేవస్థానం నకు చెల్లించియున్నారు.


శ్రీ అమ్మవారి సేవలో...

కార్యనిర్వహణాధికారి.

Comments