_చేనేత‌ల మ‌నుసు గెలిచిన నాయ‌కుడు జ‌గ‌న‌న్న_

 *_చేనేత‌ల మ‌నుసు గెలిచిన నాయ‌కుడు జ‌గ‌న‌న్న_


*


*_నేత‌న్న నేస్తం ల‌బ్ధిదారుల ఇంటికి వెళ్లి ప‌లుక‌రించిన ఎమ్మెల్యే_*

*_సీఎం వైఎస్ జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి క్షీరాభిషేకం_*


ఐదేళ్ల‌లో టీడీపీ చేయ‌లేని ల‌బ్ధి కంటే ఎక్క‌వ‌గా ఒక్క ఏడాదిలోనే చేనేత‌ల‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయ‌గ‌లిగింద‌ని, నేత‌న్న‌ల‌ మ‌న‌సు గెలిచిన నాయ‌కుడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ‌ర్యులు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. నేత‌న్న నేస్తం ప‌థ‌కం కింద వ‌రుస‌గా మూడో ఏడాది చేనేత కుటుంబాల‌కు ఒక్కో కుటుంబానికి రూ.24వేలు చొప్పున మంజూరైన విష‌యం తెలిసిందే. వారి వారి ఖాతాల్లోకే నేరుగా న‌గ‌దు మంగ‌ళ‌వారం బ‌దిలీ అయింది. ఈ సంద‌ర్భంగా స్థానిక భావ‌నారుషి న‌గ‌ర్ లోని చేనేత కార్మికుడు దామర్ల నాగరాజు నివాసానికి ఎమ్మెల్యే విడ‌దల ర‌జిని బుధ‌వారం వెళ్లారు. చేనేత‌ల‌కు త‌మ ప్ర‌భుత్వం ఎంతో మేలు చేస్తోంద‌ని తెలిపారు. ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం వైఎస్సార్‌ నేతన్న నేస్తం అమ‌లు చేయ‌డంతోపాటు.. ఆప్కో ద్వారా రూ.1,600 కోట్ల మేర ప్రయోజనం చేకూరుస్తున్నామని చెప్పారు. చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో ఆధ్వ‌ర్యంలో వ‌స్త్రాలు సేక‌రించి మాస్కులు, పిల్లల యూనిఫామ్‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం స‌ర‌ఫ‌రా చేస్తున్న విష‌యాన్ని గుర్తుచేశారు. ఇలా దాదాపు రూ.1,600 కోట్లను నేతన్నల కోసం ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తోంద‌ని తెలిపారు.

*టీడీపీ హ‌యాంలో అన్యాయం*

గత సర్కారు ఐదేళ్లలో చేనేతల కోసం కేవలం రూ.259 కోట్లు మాత్రమే వ్యయం చేసిందని, త‌మ ప్ర‌భుత్వం మూడేళ్ల నుంచి వ‌రుస‌గా చేనేత‌ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందిస్తూనే ఉన్న‌ద‌ని తెలిపారు. ఇప్పటివ‌ర‌కు రూ.600 కోట్ల‌కుపైగా చేనేత‌ల‌కు అంద‌జేసిన గొప్ప ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని చెప్పారు. కరోనా సమయంలో ఎన్ని ఆర్థిక కష్టాలున్నా.. ప్రభుత్వానికి ఉన్న సమస్యల కన్నా చేనేతలు బతకడానికి పడుతున్న ఇబ్బందులే ఎక్కువని ముఖ్య‌మంత్రి భావించార‌ని, వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో వరుసగా మూడో ఏడాది 80 వేల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చిత్ర‌ప‌టానికి ల‌బ్ధిదారులు పాలాభిషేకం చేశారు.ఈ కార్య‌క్ర‌మంలో మున్సిపల్ చైర్మన్ రఫాని,వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు,వలేటి వెంకటేశ్వర్లు,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్,రాష్ట్ర ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా వలి,కౌన్సిలర్లు విడదల గోపి,బిట్రా రాజేంద్ర,బేరింగ్ మౌలాలి,కొమరవల్లిపాడు సొసైటీ అధ్యక్షుడు తోట బ్రహ్మస్వాములు,స్థానిక వార్డ్ నాయకులు బిట్రా నాగఅంజనేయులు, అవ్వారు వెంకట సుబ్బయ్య,ఊట్ల సాంబమూర్తి,అవ్వారు ఏకాంబరం,ప్రగడ రామకోటేశ్వర్రావు,మునగాల కొండయ్య,గోలి బాలాజీ మరియు పలువురు పాల్గొన్నారు...!!

Comments